
బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?
ఇలా మనిషిని డబ్బు శాసించడం రోజురోజుకు ఎక్కువవుతోంది తప్ప పరిస్థితిలో మాత్రం మార్పు రావడంలేదు. దీంతో పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వారు ఎన్నో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎంతోమంది ఆర్థిక సమస్యలతో ప్రాణాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నరహరి అనే వ్యక్తిగత ఐదు నెలల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఇక ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలుకోల్పోవద్దు అని సదరు వ్యక్తి అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన ప్రాణాలను రక్షించుకోవడానికి క్యాన్సర్ వ్యాధి నుంచి బయట పడడానికి భారీగానే ఖర్చు చేశాడు.
ఆర్థిక స్తోమత లేక పోయినప్పటికీ అప్పులు చేసి మరీ చికిత్స చేయించుకున్నాడు.. ఇలా ప్రాణాన్ని నిలుపుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డ సదరు వ్యక్తిచివరికి చేజేతులారా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.. గ్రామానికి చెందిన నరహరి అనే 42 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాన్సర్ బారిన పడిన నరహరి క్యాన్సర్ నుంచి కోలుకునేందుకు రెండు లక్షల రూపాయలు అప్పు చేసి చికిత్స తీసుకున్నాడు. కానీ అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.