అమ్మాయిని చూసి ఆగలేకపోయాడు.. 27 జైలు శిక్ష పడింది?

frame అమ్మాయిని చూసి ఆగలేకపోయాడు.. 27 జైలు శిక్ష పడింది?

Chakravarthi Kalyan
దళిత యువతిని మోసగించి గర్భవతిని చేసిన నిందితుడికి కోర్టు 27 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. నల్లగొండ జిల్లా కనగల్ మండల పరిధిలోని పర్వతగిరి గ్రామానికి చెందిన నల్లబోతు జగన్ గుర్రంపోడు మండలం శాఖపురం గ్రామానికి చెందిన దళిత యువతికి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆమెను మోసగించి గర్భవతిని చేసిన తర్వాత మాట మార్చాడు. దీంతో బాధితురాలు గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో Cr.No.84/2019, SC.No.88/2020 U/s 417, 420, 376(n) IPC & Sec 3 (2) (v) of SC/ST (POA) Act-1989 కింద కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు నిర్వహించి సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.


జిల్లా అదనపు సెషన్ & ఎస్సీ ఎస్టీ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. సెక్షన్ 376(2)(n) IPC కింద నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధించబడింది. SC/ST (POA) చట్టంలోని సెక్షన్ 3(2)(v) కింద నేరానికి మరో పది సంవత్సరాల జైలు శిక్షతో 1000 రూపాయల జరిమానా విధించబడింది. ఐపీసీ సెక్షన్ 420 కింద నేరానికి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో 1000 రూపాయల జరిమానా విధించబడింది. మొత్తంగా నిందితుడికి 27 సంవత్సరాల జైలు శిక్ష ఖరారైనట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు.


ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అప్పటి విచారణ అధికారులు SDPOలు ఎస్.మహేశ్వర్, టి.ఆనంద్, ASI ఎండీ. ఖలీల్ అహ్మద్, ప్రస్తుత A.S.P పి.మౌనిక ఐపీఎస్, SHO పి.మధు, సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్ గుర్రంపోడు, CDO ఎండీ.ఇంతియాజ్ హమ్మద్, లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ గార్లను జిల్లా ఎస్పీ అభినందించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: