మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం క్రితం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సోసియో ఫాంటసీ మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. యూ వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సమయానికి సంక్రాంతికి మధ్య చాలా గ్యాప్ ఉండడంతో ఈ మూవీ కచ్చితంగా సంక్రాంతికి వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ మూవీ బృందం సంక్రాంతి బరి నుండి ఈ సినిమాను తప్పిస్తున్నట్లు మరో కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ మూవీ ని 2025 మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మే 9 వ తేదీన కూడా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేవు అని , ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ అమ్మకానికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు దాని ప్రకారం చూస్తే ఈ మూవీ ని జూన్ లేదా జూలై నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో చిరు కి ఏ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి.