నేనే జయలలిత వారసురాలిని.. షాకిచ్చిన మహిళ?
అయితే ఇలా తన సుపరిపాలన తో ఎంతో మంది పేద ప్రజలకు అమ్మ గా మారిన జయలలిత ఇక ఆ తర్వాత అనారోగ్యం బారిన పడి ప్రాణాలు వదిలారు. అయితే జయలలిత మరణాన్ని తమిళప్రజల తట్టుకోలేక పోయారు. ఇక జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. జయలలిత వారసులం మేమే అంటూ ఎంతో మంది తెర మీదికి వచ్చారు. అంతేకాదు జయలలిత ఆప్తులు రాలిగా ఉన్న శశికళ.. జయలలిత స్థానాన్ని దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేశారు.
ఇక ఇప్పుడు నేనే జయలలిత వారసురాలిని అంటూ మరో మహిళ తెర మీదికి రావడం సంచలనం గా మారి పోయింది. ఇటీవలే జయలలిత వారసురాలిని తానే అంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాను వెనక తలుపు నుంచి వెళ్లి రహస్యంగా కలిశానని చెబుతుంది సదరు మహిళ. చెన్నైకి చెందిన ప్రేమ అనే మహిళ ఈ వ్యాఖ్యలు చేసింది. సమయం వచ్చినప్పుడు తానే జయలలిత వారసురాలిని అని నిరూపించుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. తొందర్లోనే వెళ్లి శశికళను కలుస్తాను అంటూ తెలిపింది. కాగా ఈ మహిళ చేసిన వ్యాఖ్యలు కాస్త తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.