వైసీపీ సర్కార్ పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటర్లు ప్రలోభాలకు గురయ్యే రోజులు పోయాయి... ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు చంద్రబాబు. పుంగనూరులో ఎన్నికల ప్రక్రియలో అడ్జగోలుగా వ్యవహరించిన ఎన్నికల అధికారిని లోకేష్ వర్మను కుప్పంలో వేశారు.లోకేష్ వర్మ అనే అధికారి పెద్దిరెడ్డి చెెంచా. అని ఫైర్ అయ్యారు చంద్రబాబు. వెలుగు కో-ఆర్డినేటర్లతో ఎన్నికల అధికారి ఎలా మాట్లాడతారు..?
లోకేష్ వర్మపై చర్యలు తీసుకోవడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏమన్నా కావాలా..? కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో చేద్దామని ప్రయత్నిస్తున్నారన్నారు చంద్రబాబు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ టీడీపీ అని.. ఎన్నికల కమిషనర్.. ఎన్నికల అధికారులు సహకరించొచ్చు.. కానీ ప్రజల్లో దోషులుగా నిలబెడతామనీ హెచ్చరించారు చంద్రబాబు.
తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎన్నికల విధుల్లో ఎలా వేస్తారు..? జహన్ ఉన్నాడని.. ఆయన చెప్పినట్టు చేసేస్తే తమ పని అయిపోతుందని అనుకుంటున్నారేమో.. కానీ అవినీతి అధికారుల అంతం ప్రారంభం అవుతుందన్నారు చంద్రబాబు. ఎన్నికల నిర్వహణలో హైకోర్టు ఆదేశాలను కూడా ఫాలో కావడం లేదని.. గురజాల మున్సిపాల్టీలో నామినేషన్ పత్రాలను లాక్కెళ్లినా పోలీసులు.. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు చంద్రబాబు.
చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు చట్టాన్ని వేరే వాళ్లకు అప్పజెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. రంపచోడవరం అసెంబ్లీ పరిధిలోని కాచవరం గ్రామంలో నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నేత బెదిరిస్తూ ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారన్నారు చంద్రబాబు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వమని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్.. పారిపోతారు.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఎన్నికలంటే ఊరికో ఆంబోతు తయారవుతోంది. జగనుకంటే పిచ్చి పట్టింది.. మీకేమైంది..? అని ప్రశ్నించారు. ఇవాళే కాదు.. రేపనేది ఒకటుందని గుర్తుంచుకోండి. ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేయడం కాదు.. అమలయ్యేలా చూడాలి... జీతాలు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాం కాబట్టి సమస్యేంటని మంత్రి కామెంట్లు చేస్తారా..? అని ప్రశ్నించారు.