మోడీ గారు.. మా పార్టీ లో చేరండి?

praveen
భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయన ఒక వ్యక్తి కాదు ప్రస్తుతం ఒక గొప్ప శక్తిగా మారిపోయారు. భారత ప్రధానిగా మారినప్పటి నుంచి వేసే ప్రతి అడుగు కూడా భారత ప్రజల గౌరవాన్ని నిలబెట్టే విధంగానే వేస్తున్నారు అని చెప్పాలి. అయితే కేంద్రంలో మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి భారత్ దౌత్య పరంగా ఎంతలా సక్సెస్ సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విదేశాంగ విధానాన్ని ఎంతో సమర్ధవంతంగా అమలు చేస్తూ ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ. భారత్ దూకుడుతో ఏకంగా ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక మోడీ సారథ్యంలో భారత్ అంతకంతకూ సాధిస్తున్న వృద్ధిరేటు అగ్రరాజ్యాలను సైతం  నివ్వెర పోయేలా చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ప్రస్తుతం అగ్రరాజ్యాల అధ్యక్షులతో సైతం మోడి సత్సంబంధాలు కొనసాగిస్తున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుతం కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువగా పాపులారిటీ సాధించిన దేశ అధ్యక్షుడుగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై ఎలాంటి సమావేశం జరిగిన కూడా సమావేశంలో నరేంద్రమోదీ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇక ఇటీవలే జి20 దేశాల సమావేశం జరిగింది అన్న విషయం తెలిసిందే  ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయారు.


 అగ్రరాజ్యాల అధ్యక్షులతో సైతం ఎంతో కలివిడిగా మాట్లాడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఏకంగా ఇజ్రాయిల్ ప్రధాని నేరుగా.. మీరు మోస్ట్ పాపులర్ మా పార్టీలో చేరకూడదు అంటూ నవ్వుతూ పలకరించడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇజ్రాయిల్ ప్రధాని ఇలా అడగడం ఒక ఎత్తు అయితే ఏకంగా అగ్రరాజ్యాల ప్రధానుల భుజాల పై చేయి వేసి మోడీ ఎంతో చనువుగా మాట్లాడటం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక g20దేశాల సమావేశంలో భారత ప్రధాని ఇలా అందరితో కలివిడిగా మాట్లాడిన తీరు మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: