ఆకివీడులో టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అవుతుందా?

M N Amaleswara rao
ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేనల పొత్తు అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్‌ని ఎదురుకోవాలంటే చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు కలవాల్సిందే అని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ పొత్తుపై ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. నెక్స్ట్ ఎన్నికల ముందు ఈ పొత్తుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈలోపు పరోక్షంగా కలిసి రాజకీయం చేస్తూ, వైసీపీని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి.
అయితే చిన్నాచితక ఎన్నికలు జరిగితే క్షేత్ర స్థాయిలో టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కొన్ని చోట్ల రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాయి. ఇక తాజాగా స్థానిక ఎన్నిక ఎన్నికలకు మళ్ళీ షెడ్యూల్ విడుదలైంది..ఎన్నికలు జరిగిపోగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ క్రమంలోనే కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల టీడీపీ-జనసేనలు కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 
ఈ క్రమంలోనే ఆకివీడు మున్సిపాలిటీలో రెండు పార్టీల పొత్తు ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మున్సిపాలిటీలో టీడీపీ స్ట్రాంగ్ గానే ఉంది. ఎందుకంటే ఆకివీడు మున్సిపాలిటీ ఉండి అసెంబ్లీ పరిధిలో ఉంది. ఉండిలో టీడీపీ ఎమ్మెల్యేగా మంతెన రామరాజు పనిచేస్తున్నారు. పైగా ఉండి టీడీపీ కంచుకోట కాబట్టి, ఆకివీడు మున్సిపాలిటీలో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే సమయంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి తిరుగులేదు.

 
అయితే అధికార పార్టీకి చెక్ పెట్టాలంటే ఇక్కడ టీడీపీ, జనసేన సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ జనసేనకు కాస్త బలం ఉంది. అలా అని జనసేనకు సొంతంగా సత్తా చాటే అవకాశం లేదు. కాబట్టి టీడీపీతో కలిసి వైసీపీకి చెక్ పెట్టాలని అనుకోవచ్చు. కాబట్టి రెండు పార్టీలు కలిసి ఆకివీడులో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: