హుజూరాబాద్ దెబ్బ‌.. కేసీఆర్ ఆ ముగ్గురిని సైడ్ చేసేస్తారా ?

frame హుజూరాబాద్ దెబ్బ‌.. కేసీఆర్ ఆ ముగ్గురిని సైడ్ చేసేస్తారా ?

VUYYURU SUBHASH
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అవ‌స‌రం ఉంటే ఎంత గొప్ప నేత ను అయినా తానే స్వ‌యంగా వెళ్లి మ‌రీ పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ గా పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె క‌విత ఓడిపోతార‌న్న సంకేతాలు ముందే వ‌చ్చాయి. అందుకే కేసీఆర్ స్వ‌యంగా మాజీ మంత్రి మండ‌వ వెంక‌టేశ్వ ర‌రావు ఇంటికి వెళ్లి మ‌రీ ఆయ‌న‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వ‌నించారు. ఆయ‌న్ను పార్టీ లో చేర్చుకున్న‌ప్పుడు రాజ్య‌స‌భ లేదా ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ఎన్నిక‌ల్లో క‌విత బీజేపీ నుంచి పోటీ చేసిన ధ‌ర్మ‌పురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. అంతే ఆ త‌ర్వాత టీఆర్ ఎస్ లో మండ‌వ వెంక‌టేశ్వ‌ర రావు ఎక్క‌డ ఉన్నారో ? ఆయ‌న అడ్ర‌స్ ఎక్క‌డో కూడా ఎవ్వ‌రికి తెలియ కుండా పోయింది.

ఇక ఇటీవ‌ల హుజూరా బాద్ ఉ ప ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ను ఓడించేందుకు కేసీఆర్ అక్క‌డ స‌ర్వ శ‌క్తులు ఒడ్డారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ని సైతం పార్టీలో చేర్చుకుఏన్నారు. ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ ని చేస్తాన‌ని చెప్పారు. అలాగే ఆయ‌న పేరు గ‌వ‌ర్న‌ర్ కు ప్ర‌తిపాదించారు. అయితే గ‌వ‌ర్న‌ర్ కౌశిక్ రెడ్డి పేరును తిర‌స్క‌రించారు. ఇక ఈ హుజూరా బాద్ కోటాలోనే చాలా మంది నేత‌ల‌కు ప‌ద‌వులు ఇచ్చారు.

పైగా టీ టీడీపీ అధ్య‌క్షుడి గా ఉన్న ఎల్ .ర‌మ‌ణ‌ను సైతం పార్టీలో చేర్చుకున్నారు. ఆయ‌న‌కు కూడా ఎమ్మెల్సీ ఇస్తామ‌ని ఆశ‌లు పెట్టారు. ర‌మ‌ణ సైతం అక్క‌డ ఉన్న ప‌ద్మ‌శాలీ వ‌ర్గం ఓట‌ర్ల‌ను టీఆర్ ఎస్ వైపు మ‌ర్చ‌లేందుకు క‌ష్ట‌ప‌డ్డారు. ఇక మ‌రో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పెద్దిరెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు హుజూరా బాద్ లో టీఆర్ ఎస్ ఓడిపోవ‌డంతో కేసీఆర్ పెద్దిరెడ్డి - ర‌మ‌ణ తో పాటు కౌశిక్ రెడ్డిని సైతం ప‌క్క‌న పెట్టేస్తార‌ని వీరు ఇక ఎమ్మెల్సీ ఆశ‌లు వ‌ది లేసుకోవ‌డ‌మే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: