RRR అంటే రాజాసింగ్- రఘునందన్ రావు- రేవంత్ !

Veldandi Saikiran
హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు.  హుజురాబాద్ లో భారతీయ జనతా కాంగ్రేస్ కలిసి పోటీ చేసాయని... టీఆరెస్ ను ఎదురుకునే సత్తాలేక బీజేపీ- కాంగ్రేస్ ను కలుపుకుందని ఆరోపించారు. కాంగ్రేస్ తో పొత్తు పై ఈటెల రాజేందర్ ఒప్పుకున్నారని...  ఢిల్లీలో శత్రువులు- రాష్ట్రంలో మిత్రులుగా పనిచేయడం సిగ్గుచేట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  RRR అంటే రాజాసింగ్- రఘునందన్ రావు- రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు బాల్క సుమన్‌.  


హుజురాబాద్ లో కేసీఆర్ సభ పెట్టకుండా ఎన్నికల సంఘం అడ్డుకుంది,, కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం బందీ అయిందని ఆగ్రహించారు.  ఎన్నికలకు ముందు ఈటెల- రేవంత్ ను కలిశారని...  హిమాచల్ ప్రదేశ్- కర్ణాటక- దేశవ్యాప్తంగా బీజేపీ కి ప్రతికూల పరిస్థితులను ఎదురుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బాల్క సుమన్‌.  హుజురాబాద్ లో కమలం పువ్వు రాలిపోకుండా హస్తం అడ్డుకుందని... కాంగ్రేస్ పార్టీని ఈటెలకు తాకట్టు పెట్టి బీజేపీని గెలిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


ప్రాంతీయ పార్టీని నిలువరించేందుకు జాతీయ పార్టీలు ఒక్కటయ్యారని నిప్పులు చెరిగారు బాల్క సుమన్‌.  హుజురాబాద్ లో మ్యానిఫెస్టో ఈటెల అమలు చేయాలని...పీఎం మోడీ దగ్గర నుంచి హుజురాబాద్ కు ఏమి  చేస్తారో చెప్పాలని నిలదీశారు.  తరుణ్ చుగ్ రిలీజ్ చేసిన మ్యానిఫెస్టో ఎన్ని రోజుల్లో అమలు చేస్తారో చెప్పాలని డిమాండ చేశారు బాల్క సుమన్‌. బీజేపీ గెలిచి నప్ప టికీ నైతి క విజయం మాత్రం తమదేనని స్పష్టం చేశారు బాల్క సుమన్‌. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని స్పస్టం చేశారు బాల్క సు మ న్.  తన మాటే నిజం కాబోతుందని స్పష్టం చేశారు టీ ఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: