టీఆర్ఎస్ కొత్త ఎమ్మెల్సీలు వీళ్లేనా...!
ఇక ఇతర పార్టీల్లో ఎమ్మెల్సీలుగా ఉండి టీఆర్ఎస్‌లో చేరి ఆ తర్వాత ఓ టర్మ్ ఎమ్మెల్సీ పదవి పొందిన వారికి ఈ సారి ఛాన్స్ లేదని టాక్ ? వీరిలో బొడకుంటి వెంకటేశ్వర్లు - నేతి విద్యాసాగర్ - ఫరీదుద్దీన్ - ఆకుల లలితకు ఈ సారి మొండి చేయి ఖాయమని పార్టీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారి తో పాటు కొన్ని కారణాల వల్ల టిక్కెట్లు రాని వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.
వీరిలో తీగల కృష్ణారెడ్డి - కొత్త మనోహర్ రెడ్డి - రామ్మోహన్ గౌడ్ - బండి రమేష్ - బొంతు రాంమ్మోహన్ - మధుసూదనాచారి - తక్కెళ్లపల్లి రవీందర్ రావు - మాజీ ఎంపీ సీతారాంనాయక్ - హుజూర్ నగర్ టిక్కెట్ ఆశించి భంగపడిన కోటిరెడ్డి - కర్నె ప్రభాకర్ - ఇటీవల పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు - ఎల్. రమణ - ఇనుగాల పెద్దిరెడ్డి - మండవ వెంకటేశ్వరరావు తో పాటు గత లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ దక్కని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లాంటి నేతలు అందరూ టిక్కెట్ రేసులో ఉన్నారు. మరి వీరిలో కేసీఆర్ ఎవరికి టిక్ పెడతారో ? చూడాలి.