బీజేపీకి బాబు దగ్గరగా...పవన్ దూరంగా..ఈ ట్విస్ట్‌లు ఏంటి?

M N Amaleswara rao
ఏపీలో రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకుంటాయో అర్ధం కాకుండా ఉంది. ఇప్పటికే అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి...ఎప్పుడు ఎలాంటి రాజకీయం నడుస్తుందో అర్ధం కాకుండా ఉంది...ఓ వైపు అధికారంలో ఉన్న జగన్...ప్రతిపక్ష టీడీపీని దెబ్బ మీద దెబ్బ కొడుతూ...ఆ పార్టీని పుంజుకొనివ్వకుండా ప్రయత్నిస్తున్నారు.

ఇటు చంద్రబాబు ఏమో...జగన్‌ని ఎక్కడకక్కడ నెగిటివ్ చేసేసి....వైసీపీకి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మధ్యలో పవన్ కల్యాణ్ సైతం..జగన్ టార్గెట్‌గా రాజకీయం చేస్తున్నారు. ఇక వీరి రాజకీయ క్రీడని బీజేపీ చూస్తూ, తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతుంది. సరే బీజేపీ ఎంత రాజకీయం చేసిన పెద్దగా వర్కౌట్ అవ్వదనే చెప్పాలి. అసలు ఆ పార్టీకి ఏపీలో చోటు లేదనే చెప్పాలి. కాకపోతే మిగిలిన పార్టీలని అడ్డం పెట్టుకుని రాజకీయ క్రీడ ఆడాలనేది బీజేపీ స్ట్రాటజీగా తెలుస్తోంది.

రాష్ట్రంలో పవన్‌తో పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్న బీజేపీ...కేంద్రంలో జగన్‌ని దగ్గర చేసుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో పెద్దలు జగన్‌తో ఎంత సఖ్యతతో ఉంటున్నారో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా చంద్రబాబుకు చెక్ పెట్టడానికి బీజేపీ జగన్ ద్వారా ఇప్పటివరకు గేమ్ ఆడుతూ వచ్చినట్లే కనిపిస్తోంది. కానీ కొంతకాలం నుంచి స్ట్రాటజీలు మారిపోతున్నాయి. కాస్త క్లియర్‌గా పరిశీలిస్తే కొంతకాలం నుంచి పవన్...బీజేపీకి దూరం జరిగినట్లే కనిపిస్తోంది. అది వారి పోలిటికల్ స్ట్రాటజీనా లేక నిజంగానే దూరం జరిగారా? అనేది తెలియడం లేదు.

అదే సమయంలో బీజేపీ నేతలు...జగన్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య బాబుపై దూకుడుగా రాజకీయం చేయడం తగ్గించారు. అలాగే చంద్రబాబు సైతం మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. కానీ మొన్నటివరకు బాబుని దగ్గరకు రానివ్వని బీజేపీ....ఇప్పుడు కాస్త బాబు పట్ల మెతక వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా పొత్తుల గురించి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ...ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటున్నారు. అంటే బీజేపీ పూర్తిగా ఏపీలో పోలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: