వారసుడే ఆ మంత్రికి మైనస్..పవన్‌ కూడా...!

M N Amaleswara rao
ఏ రాజకీయ నాయకుడైన తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి పొజిషన్‌లో నిలపాలని చూస్తారు. అలా ప్రతి నాయకుడు భావిస్తారు...ఇప్పటికే ఏపీలో చాలామంది సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. అసలు చెప్పాలంటే వైఎస్సార్ వారసుడుగా జగన్, చంద్రబాబు వారసుడుగా లోకేష్‌లు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. అయితే వారసత్వ రాజకీయంలో ఎలాంటి తప్పులేదు. కాకపోతే సమర్ధవంతమైన వారసులు కావాలి..వారినే ప్రజలు ఆదరిస్తారు.


అలా కాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారసులకు పెత్తనం ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎవరైనా ప్రజల ఆమోదంతోనే అధికారం చెలాయించాలి అలా కాకపోతే ఏం అవుతుందో లోకేష్‌ని చూస్తే అర్ధమవుతుంది. చంద్రబాబు అధికారంలో ఉండటంతో తన వారసుడు లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ, మంత్రిని చేశారు.  దీని వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగింది...2019 ఎన్నికల్లో లోకేష్ పరిస్తితి ఏమైందో చెప్పాల్సిన పనిలేదు. లోకేష్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు నాయకుడుగా నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఏపీలో కొందరు మంత్రుల వారసులు అధికారాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది...అలా తండ్రి అధికారాన్ని వాడుకున్న వారసుల్లో మంత్రి పేర్ని నాని వారసుడు ముందు ఉన్నట్లు కనిపిస్తోంది. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని నాని జగన్ క్యాబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సరే మంత్రిగా నాని ఎలా పనిచేస్తున్నారనే విషయం పక్కనబెడితే...మధ్యలో పేర్ని వారసుడు కృష్ణమూర్తి(కిట్టు) హడావిడి ఎక్కువైపోయింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఈయనే అతిథిగా వస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో ఆర్టీసీ డీపో డ్రైవింగ్ స్కూల్లో 9వ బ్యాచ్ శిక్షణాతరగతుల కార్యక్రమం జరిగింది...ఆ కార్యక్రమానికి ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ ఎంవై దానం అతిథిగా రావాలి....కానీ కిట్టు దానికి అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమం అనే కాదు...అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు అతిథిగా మంత్రి వారసుడు హాజరవుతున్నారు.
అసలు మంత్రి గారి వారసుడుకు ఎలాంటి హోదా లేదు...సరే తన తండ్రి మంత్రిగా ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తే బాగుటుంది...అలా కాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని హడావిడి చేయడం మాత్రం కరెక్ట్ కాదనే వాదనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా పేర్ని వారసుడు పనులు...పేర్నికే మైనస్ అయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే పవన్‌తో కయ్యం వల్ల కాస్త నెగిటివ్ అయింది...నియోజకవర్గంలో కాపు ఓటర్లు నానికి దూరమయ్యే పరిస్తితి వచ్చింది...ఇప్పుడు వారసుడు వల్ల ఇంకా డ్యామేజ్ జరిగేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: