తణుకులో టీడీపీ..నర్సాపురంలో జనసేన...వైసీపీకి ఛాన్స్ లేదా?

M N Amaleswara rao
ఎలాగైనా అధికార వైసీపీకి చెక్ పెట్టాలని ప్రతిపక్ష టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది...ఎక్కడకక్కడ వైసీపీని నిలువరించే ప్రయత్నం చేస్తుంది...అదే సమయంలో జనసేన సైతం తమకు పట్టున్న చోట అధికార వైసీపీని దెబ్బకొట్టాలని అనుకుంటుంది. ఇక రెండు పార్టీలు కలిసి కూడా వైసీపీకి చెక్ పెట్టొచ్చనే ప్రచారం బాగా నడుస్తోంది. అయితే రెండు పార్టీలు కలవకపోయినా, పశ్చిమ గోదావరిలోని కొన్ని నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీలు వల్ల వైసీపీకి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి.
అలాంటి నియోజకవర్గాల్లో తణుకు, నరసాపురం నియోజకవర్గాలు ముందు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనల మధ్య భారీ స్థాయిలో ఓట్లు చీలిపోయి చాలా నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది...అలాగే ఈ రెండు చోట్ల కూడా వైసీపీ గెలిచింది..కానీ అది కూడా చాలా తక్కువ మెజారిటీలతో...ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిసి బరిలో ఉంటే ఈ రెండు చోట్ల వైసీపీ జెండా ఎత్తేసేది. అయితే ఈ సారి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.
తణుకు విషయానికొస్తే...గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ కేవలం 2 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీపై గెలిచింది. వైసీపీ తరుపున కారుమూరి నాగేశ్వరరావు, టీడీపీ నేత అరిమిల్లి రాధాకృష్ణపై గెలిచారు. ఇక్కడ జనసేనకు ఓట్లు బాగానే పడ్డాయి. అయితే జనసేనని పక్కనబెడితే...తణుకులో ఈ సారి కారుమూరికి రాధాకృష్ణ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేగా కారుమూరి అద్భుతంగా ఏమి పనిచేయడం లేదు...అటు రాధాకృష్ణ కూడా బాగా పికప్ అయ్యారు. దీని బట్టి చూస్తే కారుమూరికి రాధాకృష్ణ ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు.


అటు నరసాపురంలో వైసీపీ 5 వేల ఓట్ల మెజారిటీతో జనసేనపై గెలిచింది. ఇక్కడ టీడీపీ మూడోస్థానానికి పరిమితమైంది. అయితే ఈ సారి ఇక్కడ వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని జనసేన భావిస్తుంది....అదే సమయంలో ఒకవేళ టీడీపీ-జనసేనలు గానీ కలిస్తే రెండుచోట్ల వైసీపీకి ఛాన్స్ రావడం కష్టమే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: