సోషల్ మీడియా ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మేకపాల ధర?

praveen
నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఎక్కడో మారుమూల జరిగిన విషయాలను కూడా క్షణాల్లో వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాం.  ఇలా సోషల్ మీడియా వాడకం కారణంగా ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో అయితే సోషల్ మీడియాలో నిజమైన వార్తల కంటే తప్పుడు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లకు కనిపించే వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది. కొన్ని కొన్ని వార్తలు అయితే ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాయి అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు.

 మొన్నటివరకు కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ మారిపోయాయ్.  ప్రభుత్వ అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే సోషల్ మీడియాలో వార్తలు మాత్రం ప్రజలందరిలో భయాన్ని పెంచుతున్నాయి. అయితే ఇప్పుడు సీజనల్ వ్యాధుల కాలం అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో డెంగ్యూ మలేరియా వంటి సీజనల్ వ్యాధులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు కూడా మరోసారి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఎన్నో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలు కారణంగా ఏకంగా నిన్న మొన్నటి వరకు 30 రూపాయల లీటర్ ఉన్న మేకపాలు ఇక మూడు వందల రూపాయలకు చేరింది.

 ఈ ఘటన మధ్యప్రదేశ్లోని చత్తారు పూర్ లో చోటుచేసుకుంది. ఒక్కసారిగా మేక పాల ధరలు పెరిగిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో వార్తల కి మేక పాల ధరలు పెరగడానికి కారణం ఏంటి అని ఆలోచనలో పడ్డారు కదా..  అయితే దానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవలే చతర్పూర్ లో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరగాలి అంటే మేక పాలు తాగాలి అన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో అక్కడి ప్రజలందరూ ఎగబడుతున్నారు.  దీంతో నిన్న మొన్నటి వరకు 30 రూపాయలు పలికిన మేక పాల ధర ఇక ఇప్పుడు లీటర్ 300 రూపాయలు పలుకుతోంది. అయితే డెంగీ బారిన పడిన వారు తప్పనిసరిగా మేక పాలు తాగాలి అన్నది ఏమీ లేదు అంటూ వైద్యులు క్లారిటీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: