పార్వతీపురంలో వైసీపీకి మళ్ళీ ఛాన్స్ లేదా?

M N Amaleswara rao
విజయనగరం జిల్లా పార్వతీపురం... తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన నియోజకవర్గం.. 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా ఇక్కడ టి‌డి‌పి గెలిచింది. ఇక 1999, 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోగా 2014 ఎన్నికల్లో మరొకసారి గెలిచింది. గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. వైసీపీ తరుపున అలజంగి జోగారావు, టి‌డి‌పి నేత బొబ్బిలి చిరంజీవులుపై విజయం సాధించారు.


అయితే ఎమ్మెల్యేగా  జోగారావు తనదైన శైలిలో ముందుకెళుతున్నారు...ప్రభుత్వ పథకాలు మెయిన్ అడ్వాంటేజ్ అవుతున్నాయి. పథకాలు తప్ప నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం. రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉంది... తాగునీరు సమస్యలు అలాగే ఉన్నాయి. దీనికితోడు నియోజకవర్గంలో వైసీపీ నేతల అక్రమాలు ఎక్కువగానే నడుస్తున్నాయని తెలుస్తోంది.


పార్వతీపురంలో ఎమ్మెల్యే పైరవీలు, అక్రమ వసూళ్లు చేస్తున్నారని ప్రతిపక్ష టి‌డి‌పి ఆరోపిస్తుంది. ఇవన్నీ ఎమ్మెల్యేకు పెద్ద మైనస్ అవుతున్నాయి. అటు వైసీపీలో గ్రూపు తగాదాలు కూడా ఎమ్మెల్యేకు అతి పెద్ద మైనస్ అవుతున్నాయి. ఇక్కడ వైసీపీ నేత ప్రసన్న కుమార్ సెపరేట్ గ్రూప్ రాజకీయం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రసన్న కుమార్ ఇక్కడ వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టికెట్ రాలేదు...దీంతో టికెట్ దక్కించుకుని గెలిచిన జోగారావుకు ప్రసన్న కుమార్ వర్గం పెద్దగా సహకరించే పరిస్తితి కనిపించడం లేదు. అసలే మైనస్‌లు ఎక్కువ ఉన్న జోగారావుకు, సొంత పార్టీలో గ్రూపు తగాదాలు తలనొప్పి అయిపోయాయి.


నెక్స్ట్ ఎన్నికల్లో ఈ ప్రభావం గట్టిగా పడేలా కనిపిస్తోంది. అటు టి‌డి‌పి నేత చిరంజీవులు సైతం బాగానే పుంజుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఎలాగో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది...నియోజకవర్గంపై పట్టు ఉంది కాబట్టి, త్వరగానే చిరంజీవులు పుంజుకున్నట్లు కనిపిస్తోంది. పైగా వైసీపీలో ఉన్న మైనస్‌లు చిరంజీవులుకు కలిసొచ్చేలా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే పార్వతీపురంలో వైసీపీకి మళ్ళీ ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: