2024: ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పవన్...!
అయితే గత ఎన్నికలలో పవన్ ఈ రెండు పార్టీ లతోనూ విబేధించి కమ్యూనిస్టులతో జట్టు కట్టారు. జనసేన తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది. అయితే పవన్ గత ఐదేళ్లు రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో జనసేన పై జనాలకే కాదు.. చివరకు పవన్ అభిమానులకు కూడా నమ్మకం పోయింది. అందుకే పవన్ అభిమాను లే కాకుండా.. ఇటు కాపు సామాజి క వర్గం వారు కూడా పవన్ కు ఓట్లేయ లేదు.
ఇక పవన్ పార్టీ చిత్తు గా ఓడిపోవడం ఓ షాక్ అయితే ఆ పార్టీ కేవలం రాజోలు లో మాత్రమే గెలవడం మరో షాక్. ఇక పవన్ పార్టీ అధ్యక్షుడి హోదాలో రెండు చోట్ల పోటీ చేసినప్పటకి రెండు చోట్లా ఓడిపోయారు. కనీసం భీమవరంలో రెండో స్థానంలో ఉండి పరువు నిలుపు కుంటే.. గాజువాక లో మూడో ప్లేస్ తో సరి పెట్టుకున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో జనసేన + టీడీపీ పొత్తు ఉంటుందన్న నేపథ్యంలో పవన్ ఈ సారి ఖచ్చితంగా ఎమ్మెల్యే గా గెలవడతో పాటు 2024లో ఏపీ అసెంబ్లీలో కి అడుగు పెడతారని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి పవన్ కోరిక వచ్చే ఎన్నికల్లో అయినా తీరుతుందా ? లేదా ? అన్నది చూడాలి.