చంద్రబాబుకు బిగ్ షాక్.. బీజేపీలోకి కేశినేని నాని..?
ఈ మేరకు కేశినేని నాని ఢిల్లీలోని ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కేశినేని భవన్ పార్లమెంట్ కార్యాలయం లో జరిగిన కొన్ని మార్పులు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. గతంలో కేశినేని ఆఫీసులో చంద్రబాబు బొమ్మలు కనిపించేవి. చంద్రబాబుతో కేశినేని నాని దిగిన ఫోటోలు కనిపించేవి. అంతే కాదు. చంద్రబాబు మరియు ఏడు నియోజకవర్గాల ముఖ్యనేతల ఫోటోలు ఉండేవి.. ఇప్పుడు వాటిని తొలగించించేశారు. ఇప్పుడు కేశినేని పార్లమెంట్ ఆఫీసులో అవి మాయం కావడం కూడా చర్చనీయాంశమవుతోంది.
మరి ఇప్పుడు కేశినేని ఆఫీసులో ఏం బొమ్మలు ఉన్నాయంటే.. చంద్రబాబు నాయుడు స్థానంలో రతన్ టాటా మరియు నాని కలిసి ఉన్న ఫోటోలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న ఏడు నియోజకవర్గాల ఇన్చార్జులు మరియు నాయకులు స్థానంలో గత ఐదు సంవత్సరాల్లో చేసిన సేవా కార్యక్రమాలు ఫోటోలను నాని ఏర్పాటు చేశారు. ఈ మార్పులన్నీ చూసిన వారికి కేశినేని నాని త్వరలోనే బీజేపీలో చేరిపోతున్నారని ఇట్టే అర్థం అవుతోంది.
కేశినేని నాని కొంతకాలంగా పార్టీలోనూ ఉక్కపోత ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలో అసంతృప్తితో ఉండే బదులు బీజేపీలోకి వెళ్లడం మంచిదని కేసినేని నాని భావించినట్టున్నారు. అలాగే నాని వ్యాపారవేత్త.. తనలాంటి వారికి అధికారంలో ఉన్న బీజేపీయే బెటర్ అని ఆయన భావించారేమో అన్న వాదన కూడా వినిపిస్తోంది.