హుజురాబాద్ పోల్ : గెళ్లు శ్రీనివాస్ కు మంత్రి పదవి ?

Veldandi Saikiran
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి అందరికీ విధి తమే.  హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎలాగైనా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు అనేక వ్యూహరచనలు చేస్తున్నారు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. హుజూరాబాద్ నియోజకవర్గం లో గెలుపు కోసం సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. 

ఇందులో భాగంగానే ట్రబుల్ షూటర్ మరియు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు హుజురాబాద్ నియోజకవర్గ ప్రచార బాధ్యతలను అప్పగించారు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అలాగే దళిత బంధు పథకం మరి ఇతర సంక్షేమ పథకాల పేరుతో... ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. అలాగే ఇతర పార్టీల నేతలను కూడా  చేర్చుకుంటుంది గులాబీ పార్టీ. ఇలా అన్నీ ప్రయోగాలను చేస్తూ ప్రజలకు దగ్గర అవుతోంది. ఇది ఇలా ఉండగా..  హుజూరాబాద్ నియోజకవర్గం లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.  

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో... టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెళ్లు శ్రీనివాస్ కు సీఎం కేసీఆర్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారట. అది ఏంటంటే... ఈ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలిస్తే... తెలంగాణ కేబినెట్లోకి తీసుకోనున్నారని సమాచారం. ఈ మేరకు గులాబీ బాస్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఎన్నికలకు ముందు ఓ బహిరంగ సభ పెట్టి... దీనిపై స్వయంగా గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటన చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈటెల బయటికి వెళ్ళాడు కాబట్టి ఆయన స్థానంలోనే గెల్లు శ్రీనివాస్ కు మంత్రి వర్గంలో స్థానం కల్పించేందుకు టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ నియోజకవర్గంలో సులభంగా విజయం సాధించవచ్చనీ ఆలోచన చేస్తోంది టిఆర్ఎస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: