పోలీసులు కాదు.. మావోయిస్టు నేతలను భయపెడుతోంది ఇదే..?

Chakravarthi Kalyan
మావోయిస్టులు... తుపాకీ గొట్టం ద్వారానే సమ సమాజ స్థాపన.. వర్గ నిర్మూలన సాధ్యం అని నమ్మిన వ్యక్తులు.. అడవుల్లో ఉంటూ.. తమ సిద్ధాంతం కోసం పని చేస్తున్నారు. అయితే.. రాజ్యాంగ విరుద్ధమైన ఈ పద్దతులను రాజ్యం ఎప్పుడూ సహించదన్న సంగతి తెలిసిందే. అందుకే మావోయిస్టుల ఏరివేత కోసం పోలీసు బలగాలు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తుంటాయి. అయితే పెరుగుతున్న టెక్నాలజీ.. మావోయిస్టు భావజాలం వైపు క్రమంగా జనంలో తగ్గుతున్న ఆసక్తి.. ఉద్యమాన్ని బలహీనం చేస్తున్నాయి.


అంతే కాదు.. ఒకప్పుడు బలంగా కనిపించిన ఈ ఉద్యమం ఇప్పుడు క్రమంగా కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతోంది. అందులోనూ టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో పోలీసులకు చిక్కకుండా నివసిచడం  మావోయిస్టులకు సవాలుగా మారింది. దీనికి తోడు ఇప్పుడు మరో సమస్య మావోయిస్టు నేతలు ఆటంకంగా మారుతోంది. మావోయిస్టు నేతల్లో చాలా మంది 50 ఏళ్లకు పైబడిన వారే.. దీంతో వారిలో చాలామంది బీపీ, షుగర్ వంటి సాధారణ సమస్యలతో పాటు అనేక ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు.


వయస్సుతో పాటు తలెత్తే అనేక ఆరోగ్య సమస్యలు మావోయిస్టు అగ్రనేతలను వేధిస్తున్నాయి. వాటికి చికిత్స పొందడం వారికి కష్టసాధ్యంగా మారుతోంది. ఇప్పుడు పోలీసుల కంటే వ్యాధులే మావోయిస్టు అగ్రనేతలకు ఇబ్బందిగా మారాయి. వయోభారం, అరోగ్య సమస్యలు మావోయిస్టులకు అతి పెద్ద సమస్యగా మారాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సగం మందికిపైగా  60 ఏళ్లు దాటినవారేనని ఓ అంచనా. 1980ల కాలంలో పీపుల్స్‌వార్‌లో పెద్దఎత్తున చేరిన యువతరం ఆ తర్వాత అజ్ఞాతంలోకి  వెళ్లిపోయారు. వారే ఇప్పుడు అగ్రనేతలుగా ఉన్నారు.


ఇక పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులు  కూడా 40 ఏళ్లు దాటిన వారే.. 50 ఏళ్లకు అటూ ఇటుగా ఉన్నారు. ఇప్పుడు వీరంతా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. అందుకే వైద్యం పేరుతో మావోయిస్టు నాయకులను లొంగుబాటువైపు పోలీసులు నడిపిస్తున్నారు కూడా. తాజాగా అగ్రనేత ఆర్కే అనారోగ్యంతోనే కన్నుమూశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: