2025లో ఎన్నో సినిమాలు వచ్చి ఎంతో మంది ప్రేక్షకులను అలరించాయి.అలా హీరోలు ఒకటి రెండు సినిమాలతో అలరిస్తే కొంత మంది హీరోయిన్లు రెండు మూడు సినిమాలతో అలరించారు.అయితే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్స్ అనగానే చాలామందికి శ్రీలీల, రష్మిక గుర్తుకు వస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ ఇద్దరి హీరోయిన్లను దాటేసి ఓ హీరోయిన్ ఏకంగా ఆరు సినిమాల్లో నటించింది. మరి ఇంతకీ రష్మిక,శ్రీలీల లను బీట్ చేస్తూ ఆరు సినిమాలు చేసిన ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే అనుపమ పరమేశ్వరన్.. 2025 సంవత్సరం అనుపమ నామ సంవత్సరం గా మారిపోయింది. ఎందుకంటే ఈ ఏడాది అనుపమ నటించిన సినిమాలు ఏకంగా ఆరు విడుదలయ్యాయి.అలా తెలుగు, మలయాళం,తమిళం ఇలా మూడు భాషల్లో ఏకంగా ఆరు సినిమాలు చేసింది.
ఇక అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటించిన పరదా, కిష్కింధపురి రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో కిష్కింధ పురి హిట్ కాగా పరదా మూవీ యావరేజ్ గా నిలిచింది. ఇక పరదా మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ అయినప్పటికీ అనుపమ తన యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించింది. అలాగే ఈ సినిమా తర్వాత కొద్ది రోజులకే కిష్కింధపురి అనే హారర్ మూవీ తో మన ముందుకు వచ్చింది. ఈ సినిమాలో దెయ్యం పాత్రలో అనుపమ అందర్నీ భయపెట్టించింది. అలాగే తమిళంలో అనుపమ నటించిన బైసన్, డ్రాగన్ రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో డ్రాగన్ మూవీ బ్లాక్ బస్టర్ కాగా..బైసన్ మూవీ ఓ మోస్తరు హిట్ అందుకుంది.ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీలో అనుపమతో పాటు కాయాదు లోహర్ కూడా హీరోయిన్గా నటించింది.
అలా ఈ సినిమా హిట్ కొట్టడంతో అనుపమకి మంచి పేరు వచ్చింది. అలాగే సీనియర్ హీరో విక్రమ్ తనయుడు దృవ్ విక్రమ్ తో బైసన్ మూవీలో నటించింది.ఈ మూవీ కూడా మోస్తారు హిట్ కొట్టింది.ఇక మలయాళం లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని విడుదలైన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ కూడా విడుదలైంది.అంతేకాకుండా మలయాళం లో అనుపమ నటించిన మరో సినిమా పెట్ డిటెక్టివ్ కూడా విడుదలైనప్పటికీ ఈ రెండు సినిమాలు కూడా అంత హిట్ అయితే కాలేదు. అలాగే ఈనెల డిసెంబర్ 5న లాక్ డౌన్ మూవీ కూడా విడుదల కావాల్సి ఉంది కానీ ఈ సినిమా వాయిదా పడింది. అలా మొత్తంగా 2025లో అనుపమ నటించిన ఆరు సినిమాలు విడుదల కావడంతో ఈ ఏడాది మొత్తం అనుపమ నామ సంవత్సరంగా మారిపోయింది. ఇక అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ తో కలిసి భోగి అనే సినిమాలో నటిస్తోంది.