ఆ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు.. దాని వెనుక ఎవరు..?

MOHAN BABU
బీడు భూములు బంగారం అయ్యాయి. పనికిరావనుకున్న స్థలాలు కోట్లు పలుకుతున్నాయి.  తెలంగాణ లో రీజనల్ రింగ్ రోడ్డుకు కొత్త కష్టాలు వచ్చాయి. అలైన్ మెంట్ లో మార్పుతో అటు కాంట్రాక్టర్లు ఇటు ఖజానాపై పెనుభారం తప్పేలా లేదు. దీంతో RRRAqrF+5'a ఎప్పుడు పట్టాలి ఎక్కుతుందో అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకే మణిహారం . హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు  కు వెలుపల రానున్న రహదారి. 8 లైన్లతో, 340 కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నారు. దీనికి కేంద్రం నుంచి అనుమతులు రావడంతో నిర్మాణ పనుల పై ఫోకస్ చేసిన కాంట్రాక్టర్లకు ఆదిలోనే సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.

హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు ను రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫస్ట్ ఫేస్ లో సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్,గజ్వేల్, జగదేవ్ పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు నిర్మిస్తారు. ఇక రెండో దశలో చౌటుప్పల్,యాచారం, కడ్తాల్, షాద్ నగర్, చేవెళ్ల, కంది నుండి సంగారెడ్డి వరకు నిర్మాణం పూర్తి చేస్తారు . మొత్తం 18 వేల కోట్లతో నిర్మించనున్న ర్ర్ర్ కు సుమారు 11 వేల ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును దక్కించుకున్న కే అండ్ జె కంపెనీ అలైన్మెంట్ కోసం రంగంలోకి దిగడంతో అసలు సమస్యలు బయటపడ్డాయి. 2016లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి  RRR అలైన్మెంట్ పై నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సర్వేకు వచ్చిన కాంట్రాక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2016 నాటితో పోలిస్తే పరిస్థితుల్లో చాలా తేడాలు వచ్చాయి. నాడు నిరుపయోగంగా ఉన్న భూముల రూపురేఖలు మారిపోయాయి. కాలేశ్వరం నీటితో నాడు బీడుగా ఉన్న భూములు  ఇప్పుడు  మాగాణుల్ని తలపిస్తున్నాయి. rrr  ఫస్ట్ ఫేస్ లో సంగారెడ్డి తో మొదలై చౌటుప్పల్ దగ్గర ముగుస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతానికి కాలేశ్వరం నీళ్లు వచ్చాయి .

దీంతో కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్ లకు చెందిన కాలువలు రీజనల్ రింగ్ రోడ్డు కు అడ్డంకిగా మారాయి. వాటిని దాటుకుని రోడ్డు నిర్మించాలంటే అష్టవంకరలు తప్పదని కాంట్రాక్టర్లు తలపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  RRR అలైన్మెంట్ లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు సీఎం కేసీఆర్. మొత్తానికి తెలంగాణకే మణిహారంల మారుతుందనుకున్న రీజనల్ రింగ్ రోడ్డు కు బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ అడ్డంకులనన్ని తొలగించుకుని rrr ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: