ఆ మూడు సీట్లు జేసీ ఫ్యామిలీ లాగేస్తుందా?
2019 ఎన్నికలోచ్చేసరికి....అనంతలో దివాకర్ తనయుడు పవన్, తాడిపత్రిలో ప్రభాకర్ తనయుడు అస్మిత్‌లు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అయితే తాడిపత్రిలో తొలిసారి జేసి ఫ్యామిలీకి ఓటమి ఎదురైంది. ఆ ఓటమి నుంచి బయటపడేందుకు జేసి ఫ్యామిలీ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన బాధ్యత ఆ ఫ్యామిలీపై ఉంది. పైగా మూడు సీట్లని టిడిపి వశం చేయాల్సి ఉంటుంది. లేదంటే జేసి ఫ్యామిలీకి సత్తా లేనట్లు అవుతుంది.
ప్రస్తుతం తాడిపత్రిలో జేసి ఫ్యామిలీ పికప్ అయింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో తాడిపత్రిలో టిడిపిని గెలిపించగలిగారు. ఛైర్మన్ పీఠంలో ప్రభాకర్ రెడ్డి కూర్చోగలిగారు. తాడిపత్రిలో టిడిపి గెలుపుకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. అయితే అనంతపురం పార్లమెంట్ సీటులో పవన్ గెలవాల్సిన అవసరముంది.
అయితే జేసి ఫ్యామిలీపై మిగిలిన టిడిపి నేతలు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో అనంత పార్లమెంట్‌లో పవన్ గెలుపు కోసం మిగిలిన టిడిపి నేతలు కృషి చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఎన్నికల్లోపు పరిస్తితులు చక్కబడితే ఇబ్బందులు ఉండవు...పవన్‌కు గెలవడానికి అవకాశం దక్కుతుంది. ఇక ఈ రెండు సీట్లతో పాటు శింగనమలలో టిడిపిని గెలిపించాల్సిన బాధ్యత జేసి ఫ్యామిలీదే. ఎందుకంటే గత ఎన్నికల్లో టిడిపి టిక్కెట్ బండారు శ్రావణికి ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో శ్రావణి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో శ్రావణి మళ్ళీ నిలబడుతున్నారు. ఇక అప్పుడు శ్రావణిని గెలిపించుకోవాల్సిన అవసరముంది. మరి చూడాలి ఈ మూడు సీట్లని జేసి ఫ్యామిలీ టిడిపి ఖాతాలో పడేలా చేస్తుందో లేదో?