బాబు....బీదాకు ఆ ఛాన్స్ ఇస్తారా?
గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఈయన నెల్లూరు రూరల్‌లో టిడిపి తరుపున పోటీ చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ప్లేటు తిప్పేసి వైసీపీలోకి వెళ్ళి, నెల్లూరు పార్లమెంట్‌లో గెలిచేశారు. దీంతో కావలి అసెంబ్లీలో పోటీ చేయాల్సిన బీదా మస్తాన్ రావుని టిడిపి తరుపున నెల్లూరు పార్లమెంట్‌లో నిలబెట్టారు. కానీ నెల్లూరులో టిడిపి గెలుపు కష్టమే అని మళ్ళీ రుజువైంది. బీదా ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక బీదా కూడా టిడిపిని వీడి వైసీపీలోకి జంప్ కొట్టారు. ప్రస్తుతం వైసీపీలో బీదాకు ఎలాంటి పదవులు దక్కలేదు.
ఇక బీదా వైసీపీలోకి వెళ్ళడంతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్‌లో టిడిపి తరుపున ఎవరు బరిలో దిగుతారనేది క్లారిటీ లేదు. కానీ బీదా సోదరుడు బీదా రవిచంద్రయాదవ్ టిడిపిలోనే ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ఇటీవల పూర్తి అయింది. అయితే వచ్చే ఎన్నికల్లో రవిచంద్రని నెల్లూరు పార్లమెంట్ బరిలో నిలబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. బీదాకైతే పార్లమెంట్ స్థానంపై పట్టు ఉంది కాబట్టి, ఆయన్ని బరిలో దింపే ఛాన్స్ ఉంది. ఒకవేళ బీదాకు ఛాన్స్ లేకపోతే...ఇంకో నాయకుడు ఎవరిని పెడతారనేది చూడాలి. కానీ నెల్లూరులో టిడిపి గెలవడం అంత సులువు కాదు. ఒకవేళ రాష్ట్రంలో టిడిపి గాలి ఉన్నా సరే, నెల్లూరులో టిడిపి గాలి వీయడం కష్టమే.