జ్యోతుల ఫ్యామిలీకి రెండు టిక్కెట్లు...!

M N Amaleswara rao
అనేక ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకునే బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. కానీ గత ఎన్నికల్లో టి‌డి‌పి ఒంటరిగా బరిలో దిగింది. ఇక ఒంటరిగా బరిలో దిగి ఘోరంగా ఓడిపోయింది. అయితే ఎన్నికల ముందు పార్టీ గెలుపు కోసం చంద్రబాబు అనేక రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ వల్ల పార్టీకి ఎలాంటి లాభం జరగలేదని తేలింది. ముఖ్యంగా ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ అని. సత్తా ఉన్న ఫ్యామిలీకి రెండు టిక్కెట్లు ఇచ్చినా సరే గెలిచేవారు. కానీ బాబు రూల్ వల్ల ఒక ఫ్యామిలీ నుంచి ఒకరే బరిలో దిగారు.


కేవలం అశోక్ గజపతి రాజు, కింజరాపు ఫ్యామిలీలకు మాత్రం దీనిలో మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ రూల్ వల్ల ఒరిగింది ఏమి లేదు. పార్టీ కూడా గట్టిగానే నష్టపోయింది. కానీ ఈ సారి అలా జరగకుండా చూడాలని నాయకులు ట్రై చేస్తున్నారు. అలాగే పలు బడా ఫ్యామిలీలు ఈ సారి టిక్కెట్లు దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఫ్యామిలీ నుంచి ఈ సారి ఇద్దరు బరిలో ఉండాలని చూస్తున్నారు.
జ్యోతుల నెహ్రూ ఎలాగో...జగ్గంపేట అసెంబ్లీ బరిలో దిగడం ఖాయం. అయితే ఈ సారి జ్యోతుల వారసుడు నవీన్...కాకినాడ పార్లమెంట్ నుంచి దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి నవీన్..కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. పైగా ఇక్కడ టి‌డి‌పికి మరో నాయకుడు లేరు. గత ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున కాకినాడలో చలమలశెట్టి సునీల్ పోటీ చేసి ఓడిపోయారు.
ఓడిపోయాక సునీల్ టి‌డి‌పిని వీడి...వైసీపీలో చేరారు. సునీల్ వైసీపీలో చేరడంతో కాకినాడలో టి‌డి‌పికి నాయకుడు లేకుండా పోయారు. అయితే పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న నవీన్‌నే కాకినాడ బరిలో దించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జ్యోతుల ఫ్యామిలీకి ఎలాగో....కాకినాడ పార్లమెంట్‌పై పట్టు ఉంది. మొత్తానికైతే నెక్స్ట్ ఎన్నికల్లో జ్యోతుల ఫ్యామిలీకి రెండు టిక్కెట్లు వచ్చేలా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: