జగన్ని భలే ఇరికించిన ఉండవల్లి... ?

Satya
ఏపీలో వైసీపీకి అందరూ శత్రువులే. అది వైసీపీ వారూ ఒప్పుకుంటారు. అదే తమ బలమని చెప్పుకుంటారు. సింహం సింగిల్ గా వస్తుంది. మేము ఒంటరిగానే అందరితోనే పోరాడుతామని కూడా చెప్పుకుంటారు.
దాంతో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు, మేధావులు, మాజీ ఎంపీలు, తటస్థంగా ఉండేవారు సైతం వైసీపీ మీద తమ బాణాలను ఎక్కుపెడుతూంటారు. అందులో ముందు ఎవరు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ భక్తుడు. ఆయన చలువతో రెండు సార్లు రాజమండ్రి నుంచి ఎంపీగా అయ్యారు. ఇక ఉండవల్లి రాజకీయాలకు గుడ్ బై కొట్టేశారు. అయితే తాను విశ్లేషణలకు కాదు అని ఆయన చెబుతూంటారు. అదే టైమ్ లో ఆయన ఏ ప్రభుత్వం మీద అయినా విమర్శలు చేస్తారు.
జగన్ మీద కూడా ఈ మధ్య గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు. అవి శృతి మించిపోతున్నాయి కూడా. తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్ ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేస్తాడు అంటూ చేసిన కామెంట్స్ ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. ఉండవల్లి కామెంట్స్ ని పట్టుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి వారు రెట్టించిన ఉత్సాహంతో వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో విపక్షాలు విమర్శలు చేయడం వేరు, ఉండవల్లి లాంటి వారు చేయడం వేరు. ఆయన చేబితే కచ్చితంగా జనాలకు చేరుతుంది అన్నది నిజం.
ఎందుకంటే ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. పైగా ఆయన ఏపీ ప్రజల కోసమే మంచి చెబుతారు అన్న పేరుంది. దాంతో ఆయన మాటలను జనాలు నమ్ముతారు, ఆ విశ్వసనీయత ఆయనకు ఉంది అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఇపుడు లో కొత్త టెన్షన్ మొదలైంది. టీడీపీ జనసేన వంటి పార్టీలు ఎన్ని అన్నా ఇబ్బంది లేదు, వైఎస్సార్ భక్తుడు అయిన ఉండవల్లి అంటే మాత్రం రియాక్షన్ గట్టిగా ఉంటుంది. దాన్ని కౌంటర్ చేయలేమని కూడా భావిస్తున్నారు. మొత్తానికి అప్పుల ఆంధ్రా, అప్పుల మంత్రి, అప్పుల ముఖ్యమంత్రి అంటూ ఉండవల్లి జగన్ని భలేగా ఇరికించేశాడు అన్న మాట ఉంది. మరి దీని మీద వైసీపీ ఎలా స్పందిస్తుందో ఎలా బయటకు వస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: