అనకాపల్లిలో లీడ్ మారుతుందా? వైసీపీ మైనస్ ఏంటి?
పైగా టిడిపి కొన్నిచోట్ల పుంజుకుంటుంది...అటు జనసేన కూడా సత్తా చాటాడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ రెండు పార్టీలు కలిసొచ్చే అవకాశం లేకపోలేదు..ఒకవేళ అదే జరిగితే వైసీపీకి నష్టమే తప్ప, లాభం జరగదు. అయితే ఇదే క్రమంలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో లీడింగ్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ టిడిపికి కాస్త అనుకూల పరిస్తితులు వస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు కావొస్తుంది....దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గొప్ప పనితీరు కనబర్చడం లేదని తెలుస్తోంది. అటు టిడిపి నేతలు కూడా పుంజుకుంటున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో అదే పరిస్తితి కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్‌కు అంత అనుకూల పరిస్తితులు కనిపించడం లేదు. టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పుంజుకున్నట్లే కనిపిస్తోంది.
అటు పెందుర్తి, పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి, చోడవరం, మాడుగుల వైసీపీ ఎమ్మెల్యేలు పర్వాలేదనిపిస్తున్నారు. ఇక ఆయా స్థానాల్లో టిడిపి ఇంకా పుంజుకుంటే...అనకాపల్లి పార్లమెంట్‌లో టిడిపిదే లీడ్ అవుతుంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ లో లీడ్ ఎవరిది ఉంటుందో?