వయసు ఐదేళ్లు.. మాట్లాడే భాషలు ఎన్నో తెలుసా?
ఇక్కడ ఓ బుడ్డోడు ఇలాంటిదే చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు సాధారణంగా ఐదేళ్ళ వయసులో ఏ పిల్లలైనా ఏం చేస్తూ ఉంటారు. అవసరమైతే స్కూల్ కి వెళ్లడం లేదా తోటి విద్యార్థులతో హాయిగా సరదాగా ఆడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా అది నేర్చుకో ఇది నేర్చుకో అంటూ ఎక్కడ ఒత్తిడి తీసుకు రారు. దీంతో ఐదేళ్ల వయసు ఉన్న ప్రతి చిన్నారి కూడా స్నేహితులతో ఆడిపాడుతూ కనిపించడం అమ్మానాన్నలతో మారాం చేస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక బుడ్డోడు మాత్రం తోటి స్నేహితులతో ఆడుకోవడం.. తల్లిదండ్రుల దగ్గర మారం చేయడమో చేయలేదు.
ఏదో సాధించాలి అనే పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఐదేళ్ల వయసులోనే మూడు భాషలలనూ ఎంతో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ముద్దు ముద్దు మాటలు మాట్లాడే వయసులో మూడు లాంగ్వేజ్ లలో మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ రోజు ఐదేళ్ల చిన్నారి నాకు స్నేహితుడు అయ్యాడు. అతని పేరు హితేన్ ఐదేళ్ల వయసులోనే ఫ్రెంచ్ సంస్కృతం ఇంగ్లీష్ ఎంతో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. హితేన్ నిన్ను కలవడం ఎంతో బాగా అనిపించింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ ఉప ముఖ్య మంత్రి మనీష్ సిసోడియా ఒక పోస్టు పెట్టారు.