తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి సభలు సమావేశాలతో చాలా బిజీగా ఉంటున్నాయి. బిజెపి అధ్యక్షుడు రూటు మార్చి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 30 రోజుల ప్రణాళిక విజయవంతంగా హుస్నాబాద్ కు చేరుకొని పూర్తి చేశారు. ఈ యొక్క పాదయాత్రతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి శ్రేణుల్లో జోష్ పెరిగింది అని చెప్పవచ్చు. మరి ఈ పాదయాత్ర ప్రజలకు ఏ మాత్రం ఆకట్టుకుంది.. ఈ పాదయాత్ర పార్టీకి మేలు చేస్తుందా.. లేదా తెలుసుకుందాం..?
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర నిన్నటితో పూర్తయింది. మామూలుగా ఎవరైనా పాదయాత్ర చేశారంటే ప్రజల బాధలు వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు పరిష్కార మార్గాలు చర్చించేందుకే చేస్తారు. తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇవ్వటం మామూలుగా జరుగుతుంటుంది. గతంలో పాదయాత్ర సందర్భంగా వైయస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి చేసిందిదే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది వేరే విషయం. తాజాగా బండి సంజయ్ చేసిన 36 రోజుల 438 కిలోమీటర్ల పాదయాత్ర మొదటి దశ నిన్నటితో ముగిసింది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ముగింపు సభ జరిగింది. బండి పాదయాత్ర 8 జిల్లాలు,6 లోక్ సభ నియోజకవర్గాలు,19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది.
రెండో దశ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు. బండి పాదయాత్ర కెసిఆర్ పాలన కు వ్యతిరేకంగా సాగింది. ఓవైపు రాష్ట్రాన్ని కెసిఆర్ అంధకారంలోకి నెట్టివేస్తున్నాడాని ఆరోపణలు చేస్తున్న బండి ఆ విషయాన్ని జనాల్లోకి తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఏ విధంగా సహాయపడుతుందో కొంత వివరించగల్గారు. బండి సంజయ్ పాదయాత్రకు జనాల నుంచి మద్దతు భారీగానే లభించింది. తాను అనుకున్న లక్ష్యం దిశగా పాదయాత్ర పూర్తిగా సాగిందా అంటే చెప్పలేం. కానీ బిజెపి ని కొంతవరకు ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలిగారు. అలాగే టీఆర్ఎస్ పై కొన్ని విమర్శల ద్వారా కొంత టార్గెట్ కూడా అయ్యాడు.