పవన్ దెబ్బకి.. దిగొచ్చిన జగన్?

praveen
పవన్ కళ్యాణ్..  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈయనే హాట్ టాపిక్ గా మారి పోయాడు. గత కొన్ని రోజుల నుంచి ఎంతో దూకుడుగా ముందుకు సాగుతూ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ప్రజా సమస్య లను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును ఎండ గడుతూ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతి పక్షం గా ఉన్న టీడీపీ కంటే ఎక్కువగా ప్రజల పక్షాన నిలబడి పోరాడు తున్నాడు.. ఎంతో మంది ఎమ్మెల్యేల బలం ఉన్న  టిడిపి సైతం చేయలేని పనులను అసలు శాసన సభ్యుడే కానీ పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నాడు.



 ఒక నిర్మాణాత్మకమైన ప్రతి పక్ష నాయకుడిని నేనే అంటూ తన పోరాటం తో చెప్పకనే చెబుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితి ఎలా ఉంది అనే విషయం పై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎక్కడి కక్కడ పరిస్థితి పై వివరణ ఇస్తూ ఒక వీడియోను విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారి పోయింది. ఈ వీడియో తర్వాత  కొన్ని రోజుల్లోనే రహదారులను బాగా చేయ బోతున్నాము అంటూ సీఎం కార్యాలయం సైతం ప్రకటించింది. ఇక అంతటితో ఆగని పవన్ కళ్యాణ్ ఇటీవల ధవళేశ్వరం బ్యారేజీ పై శ్రమదానం అంటూ పిలుపునిచ్చారు.



 దీనికి పర్మిషన్ ఇవ్వాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అధికారులను కోరారు. అయితే పవన్ కళ్యాణ్ శ్రమదానంకి ముందే అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ రహదారిపై ఉన్న గుంటలు అన్నింటినీ కూడా అధికారులు చకచకా పూడ్చివేయటం  గమనార్హం.  దీంతో పవన్ పోరాటానికి జగన్ ప్రభుత్వం దిగివచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు. రహదారిని బాగుచేయడానికి పవన్ కళ్యాణ్ శ్రమదానంకి పిలుపునిచ్చారని ఇక ఇప్పుడు శ్రమదానంకి ముందే రహదారి మరమ్మతులు జరిగిపోయాయి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: