గాంధీ జయంతి సందర్భంగా చూడాల్సిన టాప్ 5 చిత్రాలు !
1. గాంధీ : బ్రిటిష్ ఫిలిం మేకర్ రిచర్డ్ అటెన్ బర్గ్ 1982 సంవత్సరంలో తీసిన సినిమా గాంధీ. 1982 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా లో బ్రిటిష్ యాక్టర్ బెన్ కింగ్ మహాత్మా గాంధీ రోల్ చేశారు. 1947 కు ముందు జరిగిన... యదార్థ ఘటనలు, బ్రిటిష్ పాలనకు మహాత్మాగాంధీ ఎలా చరమగీతం పాడారు అనే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు పలు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు, ఉత్తమ డైరెక్టర్ కేటగిరీల కింద ఏకంగా ఈ సినిమాకు ఎనిమిది ఆస్కార్ అవార్డులు రావడం గమనార్హం.
2 . గాంధీ మై ఫాదర్ : మహాత్మా గాంధీ కథాంశంగా వచ్చిన మరో సినిమా గాంధీ మై ఫాదర్. ఈ సినిమా 2007 సంవత్సరంలో విడుదల కాగా.... ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ... తన సొంత కొడుకు చేత కూడా తండ్రి అనిపించుకోలేదనే కోణంలో... ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకులు. ఇక ఈ సినిమాలో దర్శన్ జరీవాలా మరియు అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు అనిల్ కపూర్.
3. హే రామ్ : గాంధీజీ కథాంశంతో వచ్చిన మరో చిత్రం హే రామ్. ఈ సినిమా 2000 సంవత్సరం లో విడుదల కాగా... స్టార్ నటుడు కమల్ హాసన్ మరియు షారుక్ ఖాన్ ఈ సినిమాలో కీ రోల్ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితులను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకులు.
4. లగే రహో మున్నాభాయ్ : లాగే రహో మున్నాభాయ్ సినిమా 2010 సంవత్సరం లో విడుదలైంది. ఈ హిందీ మూవీ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కూడా చేశారు. శంకర్ దాదా జిందాబాద్ అనే టైటిల్ తో ఈ సినిమా తెలుగులో రీమేక్ అయింది. గాంధీగిరి తో ఎలాంటి సమస్యలైనా పరిష్కరిం చుకోవచ్చనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకులు.
5. ది మేకింగ్ ఆఫ్ మహాత్మ : ది మేకింగ్ ఆఫ్ మహాత్మా గాంధీ సినిమా 1986 సంవత్సరంలో విడుదలైoది. దక్షిణాఫ్రికా దేశంలో మహాత్మా గాంధీ కి ఎదురైన చేదు అనుభవాలు... మరియు భారత దేశం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషిని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాను ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.