మా అధ్యక్ష ఎన్నికల పై నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మా'' కు ప్రెసిడెంట్ గా తెలుగోడు కావాలని ప్రకాశ్ రాజ్ కు చురకలు అంటించారు. ప్రకాశ్ రాజ్ మెంబర్ గా ఉండొచ్చు కానీ..గెస్ట్ మాత్రమేనన్నారు. ప్రకాష్ రాజ్ .. మా సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని... అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. మా లో ..శుద్ర రాజకీయం చేయొద్దని.. అవకాశాలు ఇప్పించేందుకే మా ఉన్నదని తెలిపారు నరేష్.. కరోనాలో ..ఇబ్బందులు పడ్డప్పుడు ..'మా ఉప్పులూ , పప్పిచ్చిందని... 300 పైగా ఆసుపత్రులతో మా కు అసోషియేషన్ ఉంది .. ప్రకాష్ రాజ్ గుర్తుంచు కోవాలన్నారు నరేష్.
ప్రకాష్ రాజ్ ఒక్కసారైనా మా ఎన్నికల్లో ఓటేశారా ..? ఒక్క మా మీటింగ్ కు అటెండ్ అయ్యారా .? అని ప్రశ్నించారు నరేష్. ఎన్నిసార్లు మానుండి సస్పెండ్ అయ్యారో చెప్పాలి ..? మిరే వచ్చారా ..ఎవరైనా తెచ్చారా ..? అని నిలదీశారు నరేష్. రెస్టారెంట్ లో డిస్కౌంట్ లా .. మాటలకు ..మ్యానిఫెస్టో కు సంబంధం లేదన్నారు నరేష్. సరైనోడు లేడు కాబట్టి వచ్చానని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఆశ్యర్యం కల్గించిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ , ఆంధ్ర , రాయలసీమ లో ఉన్న గొప్ప నటులు ఉన్నారు .. వీరు తెలియదా ..? అని ప్రకాష్ రాజ్ కు చురకలు అంటించారు నరేష్.
ఇప్పుడు మా కి మంచి వారసుడు కావాలని... ఆలు లేదు చూలు లేదా అని అరు నెలల ముందే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను పెట్టారని ఫైర్ అయ్యారు. నా టర్మ్ లో మా సేవలకు మురళి మోహన్ చిరంజీవి గారు మెచ్చు కున్నారని.. ఒక మంచి వారసుడిని ఇచ్చి పోవటం నా బాధ్యత అని వెల్లడించారు. ఎన్నో ఆలోచించిన తరువాత విష్ణు పర్ఫెక్ట్ వ్యక్తి అని తాను భావించానని... నా పూర్తి మద్దతు విష్ణు కి తెలుపుతున్నానని స్పష్టం చేశారు నరేష్. మా కుటుంబానికి విష్ణు లాంటి ఒక మంచి మనిషి వుండాలని తెలిపారు నరేష్.