ఉప్పూ నిప్పూ అన్న విధంగా ఉన్నాయి పరిణామాలు. ఎందుకు ఆయన అంత కోపం అయ్యారో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. పవన్ సర్ మంచి వారు ఆయన కోపం జగన్ పై ఉంటే ఉండనీ కానీ కాస్త సమయం ఇస్తే అన్న చిరంజీవి పరిష్కరిస్తారు ఈ సమస్యను.. ఆయనకు ఆ అవకాశమే లేదు ఇప్పుడు అని చాలా మంది బాధపడుతున్నారు.
రిపబ్లిక్ వేదికపై పవన్ చేసిన వ్యాఖ్యల కారణంగా కొన్ని సంచలనాత్మక మార్పులు ఇండస్ట్రీలో జరగనున్నాయి. ఇవి సినిమాను బతికిస్తాయా లేదా అన్న సంశయాలూ చెలరేగుతున్నాయి. పవన్ ప్రథమావేశం కారణంగా ఏమయినా మార్పులు జరగవచ్చు అని కూడా కొందరు అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జీఓ వరకూ ఆగకుండా అసెంబ్లీలో ఇది చర్చకు తీసుకువచ్చి ఏకంగా చట్టబద్ధత తీసుకురావొచ్చు. దాంతో స్థానిక చట్టం అమలులోకి వస్తే థియేటర్ల మనుగడపై ఇంకా ప్రభావం పెరుగుతుందే కానీ తరిగేది ఏమీ ఉండదు. ప్రథమావేశం కారణంగా కులాల ప్రస్థావన కారణంగా ఆయన వెల్లడి చేసిన మాటలు పెను వివాదాల్లో ఇరుక్కున్నాయి. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు మరి ఇటుగా రావడానికి ఇష్టపడరనే తెలుస్తోంది. థియేటర్ బిజినెస్ అనుకూలంగా లేనప్పుడు నడిపి ఏం సాధించాలన్న వాదన ఒకటి ఎప్పటి నుంచో వస్తుంది. దీని బదులు కమ్యూనిటీ హాల్స్ నిర్మించి వాటిలోనే తక్కువ సీటింగ్ తో మినీ థియేటర్ల నిర్మాణానికి ప్రయత్నిస్తే బెటర్.
అనవసరంగా కులాల ప్రస్తావన తెచ్చారా అని కూడా కొందరు అంటున్నారు. ఇక పవన్ మాట్లాడిన ప్రథమావేశం మాటలు చాలా మందిని ఇబ్బంది పెట్టాయి. ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలపై కూడా పవన్ మాట్లాడారు. ఎందుకు వచ్చిన గొడవ అని పవన్ ఊరుకుంటే ఎంత బాగుండునో అని కూడా చాలా మంది అన్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబాలను, మంచు కుటుంబాన్ని ఎందుకు వివాదాల్లోకి తేవడం అన్న మాట కూడా వినిపించింది. కొన్ని వివాదాలపై పవన్ మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎన్నికల వేళ ఎవరు ఏంటన్నది ఎవరు ఎటు అన్నది కూడా ఫలితాల వేళ ఎలానూ తేలిపోతాయి. ఆ విధంగా కాకుండా అటు సినీ వర్గాలను, ఇటు మీడియాను, రాజకీయ వేత్తలనూ అందరినీ ఆయన ఏకి పారేశారు. అదే పనిగా విమర్శించుకుంటూ గంటకు పై గా మాట్లాడారు. మంత్రులను ఎందుకు తిట్టడం ఆ నిర్ణయం నానిది కాదు జగన్ ది. ఎందుకిలా ఆయన ఫైర్ అయ్యారో అర్థం కాక ఇండస్ట్రీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.