శ్రీ‌కాకుళం వార్త : ఎంపీ చేసిన సాయంతో జ‌గ‌న్ స‌మ‌స్య ప‌రిష్కారం ?

RATNA KISHORE

ఒక్క ఎంపీ అనుకుంటే ఎన్నో మంచి ప‌నులు జ‌రిగాయి. జ‌రుగుతున్నాయి. అధికార పార్టీకి ఆయ‌న స్ఫూర్తి అన‌డంలో సందేహం లేదు. నిర్మాణాత్మ‌క వైఖ‌రి ఉన్న కుర్రాడు అత‌ను అని ఎన్నో సంద‌ర్భాల్లో వైసీపీ నాయ‌కులు, టీఆర్ఎస్ నాయ‌కులు పొగిడిన సంద‌ర్భాలున్నాయి. ముఖ్యంగా తానొక విమ‌ర్శ చేస్తే ప్ర‌భావం ఎలా ఉంటుందో అంచ‌నా వేయ‌గ‌ల చ‌దువ‌రి, విజ్ఞాన‌వంతుడు ఎంపీ రామూ అని  చాలా మంది అభిమానులు అంటుంటారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి ఇక్క‌డి స‌మ‌స్య‌పై కేంద్రాన్ని  కూడా అలెర్ట్ చేసి, త‌న‌వంతుగా కేంద్రంతో ఉన్న స‌త్సంబంధాలు ఉప‌యోగించుకుని జిల్లాకు సాయం చేశారు. ఇదేస‌మ‌యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రావారిని తీసుకువ‌చ్చారు. అదే సంద‌ర్భంలో తెలంగాణ వారికి  కూడా ఎంపీ సాయం  చేశారు. మ‌రోవైపు ఆక్సిజ‌న్ ప్లాంట్ల కొర‌త ఉంద‌ని అంత‌టా తెలియ‌గానే త‌న స్నేహితుల‌ను అప్ర‌మత్తం చేశారు.

దటీజ్ రాము. అందుకే ఆయ‌న‌కు అంత‌మంది అభిమానులు. మా జిల్లాలో..మన తోటి తెలుగు రాష్ట్రంలో కూడా!



యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు కింజ‌రాపు త‌న‌దైన శైలిలో రాష్ట్ర ప్ర‌భుత్వాధినేత‌కే అండ‌గా నిలిచారు. క‌రోనా స‌మ‌యంలో అవ‌స్థ‌లు పడుతున్న రోగుల‌కు ఆక్సిజ‌న్ ఇబ్బంది త‌లెత్తిన వెంట‌నే స్పందించి త‌న స్నేహితుల సాయంతో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు ఏర్పాటుచేశారు. మొన్న‌టి వేళ మ‌రికొన్ని నిధులు పోగేసి త‌న‌వంతుగా 50 ఆక్సిజ‌న్ బెడ్ల‌తో చిన్న పిల్లల ఐసీయూ వార్డు ఏర్పాటు చేశారు. కొన్ని సార్లు ప్ర‌భుత్వం చేయ‌ని ప‌నులు స్వ‌చ్ఛంద సంస్థలు చేస్తాయి. ఎంపీ రామూ త‌న స్వ‌చ్ఛంద సంస్థ ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి అనుబంధంగా మార్చి, త‌నవంతు నిధులే కాకుండా హైద్రాబాద్ లో ఉన్న సంస్థ‌ల సాయంతోనూ మంచి ప‌నులు చేశారు. వాటి ఫ‌లితంగా ఆక్సిజ‌న్ కొర‌త తీర్చ‌డ‌మే కాదు ఇంకొన్ని స‌మ‌స్య‌లూ ఒడ్డెక్కేలా చేశారు.


రామూ తీసుకున్న చొర‌వ మ‌రో సంస్థ‌కు ప్రేర‌ణ అయింది అన‌డంలో సందేహం లేదు. అదేవిధంగా అప్ప‌టి క‌లెక్ట‌ర్ నివాస్ ఎన్ఏసీఎల్ లాంటి పెద్ద సంస్థ‌ల‌ను ఒప్పించి రిమ్స్ లో ఆక్సిజ‌న్ ప్లాంటు ఏర్పాటు చేయించారు. ఇందుకు దేశంలో పేరున్న కొన్ని కంపెనీలు అండ‌గా నిలిచాయి. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న చొర‌వ కార‌ణంగా జిల్లాలో ఆక్సిజ‌న్ కొర‌త అన్న‌ది లేకుండా పోయింది. విప‌క్షాలు కేవ‌లం తిట్టేందుకే అన్న మాట‌లు కొట్టివేస్తూ త‌న గ‌ట్టి చేత‌ల‌తో జ‌గ‌న్ ను ఆలోచింప‌జేశారు. అందుకే ఆయ‌న‌కు వైసీపీ నేత‌ల కూడా అభిమానులే.! ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంకు ఒక‌టి చొప్పున ఆక్సిజ‌న్ ప్లాంటు ఉంది. టెక్క‌లి, ప‌లాస‌, న‌ర‌స‌న్న‌పేట‌, ర‌ణ‌స్థ‌లం, రాజాం, పాల‌కొండ, పాత‌పట్నం,  సీతంపేట‌లలో వేర్వేరు సామర్థ్యాల‌తో స్థానిక అవ‌స‌రాలు దృష్టిలో  ఉంచుకుని జ‌గ‌న్ ప్లాంట్లు ఏర్పాటుచేయించ‌డం ఎంతైనా శుభ ప‌రిణామం. త్వ‌ర‌లోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.పూర్తి స్థాయిలో...




మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: