ఇంత జ‌రుగుతుంటే... బాల‌య్య రియాక్ష‌న్ క‌రువైందా...?

VUYYURU SUBHASH
ఆయ‌న నోరు విప్పితే.. ఫైర్ బ్రాండ్ మాదిరిగా రెచ్చిపోతారు. ఆయ‌న ఏం మాట్లాడినా.. మాట‌ల తూటాలు పేల‌తాయి. సోష‌ల్ మీడియాలో అయితే.. భారీ ఎత్తున వైర‌ల్ అవుతాయి. ఆయ‌నే టీడీపీ నాయ‌కుడు.. న‌ట‌సింహం.. నంద‌మూరి బాల‌య్య‌. అటు సినిమాల్లో అయినా.. ఇటు రాజ‌కీయాల్లో అయినా.. ఆయ‌న దూకుడు ప్ర‌త్యేకం. ఆయ‌న స్ట‌యిలే డిఫ‌రెంట్. ఆయ‌న చేసే కామెంట్ల‌కు నెటిజ‌న్లు.. ఫిదా అవుతుంటారు. సంద‌ర్భాను సారంగా.. బాల‌య్య చేసే కామెంట్లు.. ఆయా విష‌యాల‌పై స్పందించే తీరు.. అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. అయితే.. తాజాగా చంద్ర‌బాబు ఇంటిపై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌పై అంద‌రూ స్పందించినా.. బాల‌య్య మాత్రం రియాక్ట్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.
ఇటీవ‌ల టీడీపీ మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు సీఎం జ‌గ‌న్ స‌హా మంత్రులపై చేసిన కామెంట్ల‌తో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ భారీ ఎత్తున చంద్ర‌బాబు ఇంటిపైకి దండెత్తార‌ని.. రాళ్లు, క‌ర్రలు, మార‌ణాయు ధాల‌తోవిరుచుప‌డ్డార‌ని.. టీడీపీ నేత‌లు భారీ ఎత్తున విమ‌ర్శించారు. దీనిపై పెద్ద ర‌గ‌డే జ‌రిగింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు స్పందించారు. ఇక‌, ఈ వేడి ఇంకా కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇంత జ‌రిగినా.. బాల‌య్య అడ్ర‌స్ ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ స్పందించ‌డం త‌ప్ప‌.. జ‌గ‌న్‌కు వార్నింగులు ఇవ్వ‌డం త‌ప్ప‌.. నంద‌మూరి కుటుంబం నుంచి కూడా ఏ ఒక్క‌రూ రియాక్ట్ కాలేదు.
మ‌రీ ముఖ్యంగా బాల‌య్య‌కు చంద్ర‌బాబు వ‌రుసకు బావ‌, వియ్యంకుడు.. పార్టీ ప‌రంగా అధ్య‌క్షుడు.. ఇలా అన్ని ర‌కాలుగానూ ఆయ‌న‌తో చంద్ర‌బాబు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. బాల‌య్య రియాక్ట్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆయ‌న సినిమాల నిమిత్తం విదేశాల్లో ఉన్నార‌ని టీడీపీ నేత‌లు స‌ర్దుకుంటున్నా.. అదేం లేదు.. ఎక్క‌డున్నా ఆయ‌న‌కు స‌మాచారం చేరింద‌ని.. స్పందించేందుకు అనేక మాధ్య‌మాలు కూడా ఉన్నాయ‌ని.. కానీ, రియాక్ట్ కాలేద‌ని అంటున్నారు. అయితే.. ఇది స్పందించాల్సినంత విష‌యం కాద‌ని.. బాల‌య్య అనుకున్నారా?  లేక‌.. తాను స్పందిస్తే.. ఈ ర‌గ‌డ మ‌రింత పెద్ద‌ద‌వుతుంద‌ని.. భావించారా?  లేక ఇప్పుడు.. రాజ‌కీయాల క‌న్నా.. సినిమాలే ముఖ్య‌మని అనుకున్నారా? అనేది చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. మ‌రి బాల‌య్య స్పందించే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: