బీజేపీకి ఎదురు గాలులు వీస్తున్నాయా..?

MOHAN BABU
త్వరలో దేశవ్యాప్తంగా రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనబడుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత వరుసగా 16 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సరిగ్గా 2024 లోక్ సభ  ఎన్నికలకు ముందు చోటుచేసుకునే  ఈ ఎన్నికలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతోందని,  ఊహించని ఫలితాలు రావచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ దాని మిత్ర పక్షాల పాలలో ఉన్న 12 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇందులో గెలుపు,  ఓటములు 2024 సార్వత్రిక ఎన్నికలని గణనీయంగా ప్రభావితం చేయనున్నది. ముఖ్యంగా ఉత్తరాదిన బిజెపి మనుగడ అంతా ఉత్తర ప్రదేశ్,  గుజరాత్ ఎన్నికల ఫలితాలతో ముడిపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 ఉత్తర ప్రదేశ్ లో బిజెపి రాజకీయమంతా మతంతో ముడిపడి ఉందన్న సంగతి తెలిసిందే. హిందుత్వ ఎజెండాతో మరోమారు ఎన్నికల్ని  గెలిపించేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజావ్యతిరేకత నెలకొంది. ప్రజావ్యతిరేకతను తగ్గించడానికి యోగిని తప్పించాలని బీజేపీ అధిష్టానం పై ఒత్తిడి ఉంది. మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని ఎన్నికల్లో కచ్చితంగా ఇది కీలకంగా మారుతుందని విశ్లేషకులు భావించారు. సీఎం పదవికి అమరేందర్ సింగ్ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు కూడా వేడెక్కాయి.

ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత పై ఆ పార్టీ అధిష్టానం ఆందోళనగానే ఉంది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బలం చూపడానికి ఆప్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అలాగే మణిపూర్లో కూడా అధికారంలో ఉన్న బిజెపి కి అనేక సవాళ్ళు ఉన్నాయి. ఎం బిరన్ సింగ్ పాలనపై అక్కడి ప్రజలు సుముఖంగా లేరు. నాగా పీపుల్స్ ఫ్రంట్, ఇతర చిన్న పార్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది  ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని సీఎంను మార్చాలని  బిజెపి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. సీఎం శ్రీ రామ్ ఠాకూర్ ను కూడా మార్చాలని చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: