మార్గాని భరత్.. వెంట్రుక కూడా పికలేదు ?

Veldandi Saikiran
రాజమండ్రి లోని  రాజానగరం  వై. సి. పి ఎమ్మెల్యే జక్కం పూడి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  తమ సొంత పార్టీ నేత  అయిన  పార్లమెంట్ సభ్యుడు  మార్గాని భరత్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు   ఎమ్మెల్యే జక్కం పూడి రాజా. పార్లమెంట్ సభ్యుడు    మార్గాని భరత్ తీరు ను తప్పుబడుతూ వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జక్కం పూడి రాజా. రాజమండ్రిలో వై. సి . పి పార్టీ  ఎం . పి  మార్గాని భరత్ కుమార్   సర్వనాశనం  చేస్తున్నారని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే జక్కం పూడి రాజా.  

తెలుగు దేశం పార్టీ  ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తో  కలిసి ఎం . పి మార్గాని భరత్ కుమార్ కుమ్మక్కు  రాజకీయాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు జక్కం పూడి రాజా.   ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి  నీ  ఇబ్బంది పెట్టిన  మాజీ జనశెన నేత జె డీ  లక్ష్మీ నారాయణ తో  కలిసి  ఎం .పి మార్గాని భరత్ కుమార్  సెల్ఫీలు  తీసుకుంటారా ? అని నిలదీశారు జక్కంపూడి.   రౌడీ షీటర్లు, భూ కబ్జా దార్లు  మార్గాని భరత్ కుమార్ వెనుక ఉన్నారని ఆరోపణలు చేశారు.    

ఎం .పి మార్గాని భరత్ కుమార్ వి చీప్ చేష్టలు, పిచ్చి పిచ్చి చేష్టలు  అని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే జక్కం పూడి రాజా. ఇప్పటికైనా ఎం .పి మార్గాని  భరత్ కుమార్ తన  తీరును  మార్చు కోవాలని సూచనలు చేశారు ఎమ్మెల్యే జక్కం పూడి రాజా.   అయినప్పటికీ భరత్ కుమార్.. ఆయన తీరును మార్చు కోకపోతే.. పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.   రాజానగరం నియోజక వర్గం లో మార్గాని భరత్..  తన  వెంట్రుక కూడా  పీకలేడని స్పష్టం చేశారు ఎమ్మెల్యే జక్కం పూడి రాజా.  తన పై  చెయ్యాల్సిన వ్యాఖ్యలు  చేసేసి చివరి గా ఎం.పి భరత్  తూచ్ అంటున్నారని నిప్పులు చెరిగారు  రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా  

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: