బీజేపీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిగ్‌షాక్‌... మామూలు దెబ్బ కాదుగా...!

VUYYURU SUBHASH
ఏపీలో మిత్ర‌ప‌క్షాలుగా ఉంటూ క‌లిసి రాజ‌కీయం చేస్తోన్న బీజేపీ - జ‌న‌సేన మ‌ధ్య గ‌త కొంత కాలంగా పొరా పొచ్చ‌లు వ‌స్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. పేరుకు మాత్ర‌మే పైకి రెండు పార్టీలు క‌ల‌సి ఉన్న‌ట్టు ఉన్నా కూడా బీజేపీ జ‌న‌సేన‌ను ఏ మాత్రం ప‌ట్టించు కోవ‌డంలేదు. తెలంగాణ ఎన్నిక‌ల్లో అయితే అస‌లు ప‌వ‌న్ ఉన్నాడా ? జ‌న‌సేన అంటే ఏ పార్టీ అన్న‌ట్టుగా బీజేపీ వ్య‌వ‌హ‌రించింది. తిరుప‌తి ఉప ఎన్నిక విష‌యంలోనూ అస‌లు ప‌వ‌న్‌ను ప‌ట్టించు కోకుండానే తామే అక్క‌డ పోటీ చేస్తామ‌ని చెప్పింది. ఇక ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో అయితే జ‌న‌సేన‌, బీజేపీని ఏ మాత్రం ప‌ట్టించు కోలేదు. పైగా జ‌న‌సేన - ఈ ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కొన్ని చోట్ల సంచ‌ల‌న విజ‌యాలు సాధించింది.

ఇక బీజేపీ ప‌వ‌న్ ను ప‌ట్టించు కోకుండా త‌న దారి తాను చూసుకోవ‌డంతో ప‌వ‌న్ కూడా త‌న దారి తాను చూసుకునే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. తాజాగా ప‌వ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని బీజేపీకి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జనసేన పార్టీ నుంచి క్లారిటీ వ‌చ్చేసింది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ కీల‌క‌నేత‌, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

ఈ క‌ర్మాగారం ప్రైవేటీక ర‌ణ చేసే అంశం కోట్లాది మంది తెలుగు ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ముడి ప‌డి ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై మ‌నోహ‌ర్ మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ విశాఖపట్నం వచ్చి ఉక్కు పరిరక్షణ పోరాటంలో పాల్గొంటారని చెప్పారు. ఆదివారం ఆయ‌న అక్క‌డ పోరాటం చేస్తోన్న వారితో చ‌ర్చించి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ ప్ర‌క‌ట‌న బీజేపీ నేత‌ల గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డేలా చేసింది. మ‌రి దీనిపై బీజేపీ నేత‌లు ఎలా స్పందిస్తారో ?  భ‌విష్య‌త్తులో ఈ రెండు పార్టీల ప్ర‌యాణం ఎలా ?  ఉంటుందో ఆస‌క్తిక‌రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: