ఢిల్లీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ఎంపీ ఒకరు బాగా మాట్లాడుతున్నారు. ఆయనను పిలిపించి అభినందించాలి నేను. ఇదీ మోడీ తీ రు. దేశాన్ని ప్రగతి దిశగా నడిపే వారంటే ఆయనకు ఇష్టం. ప్రభుత్వాలను నిందించడం కన్నా స్వశక్తిని నమ్ముకుని రాణించే వా రంటే ఆయనకు గౌరవం. స్థానిక కళాకారుల విజయాలు చూసి సంతోషిస్తారు. సింధూ లాంటి ఉన్నత స్థాయి క్రీడాకారుల నుంచి గ్రామీణ క్రీడాకారుల వరకూ ఆయన ఒకే విధంగా చూస్తారు. ఇవి కొన్ని అందరికీ నచ్చుతాయి. ఇవే ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి ప్రామాణికం కాకున్నా తమ శక్తిని తక్కువ చేసుకోకుండా రాణించే వారిని మోడీ ఎన్నడూ అభినందిస్తూనే ఉంటారు. ఈ దేశానికి మీరే కావాలి అన్న సంకేతం ఒకటి ఇచ్చి వారి భుజం తడతారు. కొన్ని బాగుంటాయి అవి కొనసాగించాలి మీరు..ఎనీవే హ్యాపీ బర్త్ డే సర్..
దేశ రాజకీయాలు ఎలా ఉన్నా మోడీ మాత్రం కొన్ని విషయాల్లో కొందరిని ప్రోత్సహిస్తారు. ఆంధ్రా నాయకులలో కొందరిని బాగా ఇష్టపడతారు. టీడీపీ ఎంపీలలో కింజరాపు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం ఎంపీ) బాగా అభిమానిస్తారు. ప్రత్యేక జోన్ (రైల్వేలకు సంబంధించి విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఏనాటి నుంచో ఉంది) విషయమై పార్లమెంట్ లో రామూ మాట్లాడినా, లేదా ప్రధాన సమస్యలపై ఆయన గొంతెత్తినా మోడీ నుంచి సానుకూల స్పందనే వస్తుంది. ఈ రోజు బాగా మాట్లాడావు వెల్డన్ అని చెబుతారు అని సమాచారం. ముఖ్యంగా యువ ఎంపీలను మోడీ బాగా ప్రోత్సహిస్తారు. వారు చెప్పేవి కాస్త వింటారు. వెంటవెంటనే కొన్నింటికి పరిష్కారం ఇవ్వలేకపోయినాచ సంబంధిత ప్రాంత సమస్యలపై వారికున్న అవగాహన ఏంటన్నది పరిశీలిస్తారు. మోడీ అన్నింటా కాకున్నా కొన్నింట బాగానే ఉంటారు. సామాన్యుల విజయాలపై ఆయనకు ఆసక్తి ఉంది. అయితే వారిని ప్రోత్సహించేందుకు స్థానిక నాయకత్వాలకు ఆయన దిశా నిర్దేశం చేయాలి కానీ చేయరు.
ఇదొక్కటే ఆయనలో మైనస్. పర్యావరణం కోసం పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తారు. వారి గురించి మన్ కీ బాత్ లో కూడా చెబుతారు. పద్మ పురస్కారం ఎంపికల్లోనూ సామాన్యులకే ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతారు. పాటిస్తారు కూడా! కొన్ని విషయాల్లో దేశం కోసం పనిచేసే వ్యక్తులకు అండగా ఉండేందుకు ఇష్టపడతారు. తమ శక్తి వంచన లేకుండా కృషి చేసే క్రీడాకారులను ఆయన ప్రోత్సహిస్తారు. ఒలంపిక్స్ సమయంలోనూ ఆయన ఇదే విధంగా ప్రవర్తించి దేశ ఔన్నత్యం చాటిన విశ్వవిజేతలను ఆయన ఎంతగానో అభినందించి వారికి అండగా ఉన్నారు. ఓడిపోయినా సరే ఈ దేశం మీ వెంటే ఉంటుందని చెప్పారు. కొన్ని మంచి గుణాల కారణంగా మోడీ ఈ దేశానికి మంచి పేరే తెస్తున్నారు. కానీ కొన్ని కారణం లేని నిర్ణయాల ప్రభావంతో ప్రజల మద్దతు కోల్పోతున్నారు.