ఏపీలో ముందస్తు వార్: జగన్‌కు ఈ సారి అక్కడ కష్టమే...!
ఇప్పుడిప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు ప్రారంభమయ్యాయి. ఇవి క్రమ క్రమంగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. కేసీఆర్ 2018లో ఎలా 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అయ్యారో ఇప్పుడు జగన్ కూడా కేసీఆర్ నే ఫాలో అవ్వాలని చూస్తున్నారు. నాడు కేసీఆర్‌కు అప్పుడప్పుడే వ్యతిరేకత ప్రారంభమైంది. ఇదే అదనుగా విపక్షాల్లో ఉన్న ఐనైక్యతను క్యాష్ చేసుకున్న ఆయన 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి మరీ ముందస్తుకు వెళ్లిపోయారు.
ఈ ఎన్నికలలో 2014 ఎన్నికలలో వచ్చిన అత్తెసరు మెజార్టీ కంటే కారు పార్టీకి బంపర్ మెజార్టీ వచ్చింది. ఇప్పుడు జగన్ కూడా అదే ప్లాన్‌లో ఉన్నారు. అయితే ముందస్తుకు వెళితే ఈ సారి జగన్‌కు గత ఎన్నికల్లో వచ్చినట్టుగా 151 సీట్లు అయితే వచ్చే ఛాన్సులు లేవు. ముఖ్యంగా రాజధాని వికేంద్రీకరణ ప్రభావంతో గుంటూరు - కృష్నా జిల్లా లతో పాటు ఉభయ గోదావరి లాంటి చోట్ల జగన్‌కు, వైసీపీకి ఎదురు దెబ్బలు తప్పవనే అంటున్నారు. రాజధాని మార్పు అంశం ఈ సారి కృష్నా - గుంటూరు జిల్లాలలో వైసీపీపై గట్టిగా ఉంటుందనే అంటున్నారు. ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ సారి జగన్‌కు ఎదురు గాలులు తప్పేలా లేవు.