ఎన్నికలకు రెడీ అవుతున్న జగన్.. వాళ్లే టార్గెట్?

praveen
2019లో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ ఇటీవలే మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు.  అయితే ముఖ్యమంత్రిగా ఎలాంటి అనుభవం లేక పోయినప్పటికీ మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఇప్పుడు వరకు ఊహించని రీతిలో పాలన అందించాడు. ఓవైపు రాజకీయ చాణిక్యుడు లాంటి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా..  ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పటికీ జగన్ ప్రభుత్వం మాత్రం పాలనలో ఎక్కడ వెనకడుగు వేసిన దాఖలాలు మాత్రం లేవు.

 ఇలా మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ తన పాలనతో జగన్ అందరిని ఆకర్షించాడు అని చెప్పాలి. ఇటీవలే మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్..  ఇక మరో రెండేళ్లు అధికారంలో ఉండనున్నారు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను ఇప్పటినుంచే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్ లో మంత్రులు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారట సీఎం జగన్. ఇక పార్టీ భారీ మెజారిటీ సాధించాలి అంటే గ్రౌండ్ లెవల్ లో క్యాడర్ ఎంతో బలంగా ఉండాలి.

 ఈ క్రమంలోనే రాబోయే రెండు సంవత్సరాలలో గ్రౌండ్ లెవెల్ లో క్యాడర్ను ఎంతో బలంగా మార్చుకుని టిడిపికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మరోసారి భారీ మెజారిటీ సాధించాలని సీఎం జగన్ భావిస్తున్నారట.  దీంతో ఇక గ్రౌండ్ లెవల్ లో ఉన్న కార్యకర్తలను టార్గెట్గా చేసుకొని..  వారితో ఎప్పటికప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు రివ్యు మీటింగ్లు నిర్వహిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపడమే కాదు  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళే విధంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా గ్రౌండ్ లెవెల్ లో కార్యకర్తలు బలంగా ఉండి దూకుడు గా పని చేస్తే  ఇక ఎన్నికల్లో ప్రభుత్వ పథకాల గురించి చేసిన మంచి పనుల గురించి ప్రజలందరికీ గొప్పగా వివరించి ప్రజలను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారట సీఎం జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: