జగన్ ఉద్యోగం.. శాపంగా మారింది?

praveen
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిరుద్యోగుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతుంది. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు పాలకులు మారుతున్నారు తప్ప అటు నిరుద్యోగుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. కొత్తవారు పాలకులుగా వస్తేనైనా తమకు ఉద్యోగాలు వస్తాయని.. బ్రతుకులు బాగుపడతాయని.. ఎన్నో రోజుల నిరీక్షణ కు ఫలితం దక్కుతుందని నిరుద్యోగులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు ఇక నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాం అంటూ హామీ ఇస్తున్న పాలకులు.. ఆ నిరుద్యోగుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాళ్లనే మరిచిపోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


 ఇక జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల తర్వాత ఇటీవల జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆ జాబ్ క్యాలెండర్ కూడా నిరుద్యోగులకు శాపంగా మారింది అని చెప్పాలి.  ఆశగా ఎదురుచూసిన నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ తో తీవ్ర అసంతృప్తి చెందారు. అయితే  మీ ప్రభుత్వం అసలు నిరుద్యోగులను పట్టించుకోదా అన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే.. ఎందుకు పట్టించుకోదు.. మేము అధికారంలోకి రాగానే ఒక లక్షా 30వేల మందికి పైగా వాలంటీర్లకు  ఉద్యోగాలు కల్పించాం అంటూ జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.


 అవును నిజమే అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం ఒక లక్ష 30 వేల మందికి పైగా వాలంటీర్ ఉద్యోగాలను కల్పించింది. కానీ ప్రస్తుతం ఉద్యోగమే అందరి పాలిట శాపంగా మారి పోయింది. అంతేకాదు ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుంది.  వాలంటీర్లు ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడంలో శాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ అలాంటి వాలంటీర్లకు నెలకు ఐదు వేల రూపాయల జీతం ఇస్తుంది ప్రభుత్వం.  దీంతో రోజురోజుకు వాలంటీర్ల బతుకులు భారం గా మారిపోతున్నాయి.  ఓవైపు పని ఒత్తిడి పెరగడం తగిన జీతం రాక పోవడం..  ఇంకోవైపు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం తో ఇక జగన్ ఇచ్చిన ఉద్యోగం కారణంగా మనస్థాపం చెంది ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు  ఇలా జగన్ గొప్పగా చెప్పుకునే ఉద్యోగం ఎంతోమందికి శాపంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: