ఇక కో-ఎడ్యుకేషన్ బంద్.. షాకింగ్ నిర్ణయం?
మహిళలకు సంబంధించిన క్రీడల విషయంలో కూడా అటు తాలిబన్లు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారూ. ఇక ఇటీవల మహిళల చదువు విషయంలో తాలిబన్ల ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అంతర్జాతీయ సమాజంలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు మహిళలు పురుషులతో కలిసి కో-ఎడ్యుకేషన్ ద్వారా చదువుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎడ్యుకేషన్ వ్యవస్థలో పూర్తిగా మార్పులు తెచ్చి తాలిబన్లు తమ విధి విధానాలను అమలు లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా తాలిబన్లు తమ విధానాలను ప్రకటిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారూ. కో ఎడ్యుకేషన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వారంతా ముస్లింలే.. వారు ఈ కో-ఎడ్యుకేషన్ రద్దు నిర్ణయాన్ని అంగీకరిస్తారు అంటూ తాలిబన్ల ప్రభుత్వం లో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న అబ్దుల్ బాకీ వ్యాఖ్యానించారు. చదువుకునే అమ్మాయిలు ప్రత్యేక డ్రెస్ కోడ్ పాటించాలి అంటూ చెప్పుకొచ్చారు. పురుషులతో సమానంగా చదువుకోవడానికి మహిళలకు యూనివర్సిటీలలో ప్రవేశం లేదు అంటూ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ చెప్పిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి పోయాయి.