సాయి రెడ్డి స్పీక్స్ : మళ్లీ హోదా ముల్లు గుచ్చుతోంది?

RATNA KISHORE
చాలా రోజులకు మీకు వినిపించిన మాట ఆంధ్రావనికి ప్రత్యేక హోదా. హోదా మాటే మరిచిపోవడం మన వంతు అయ్యాక ఏపీ స ర్కార్ కు చెందిన నేత, వాణిజ్య శాఖకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన విజయ సాయి రెడ్డి తాజాగా తమ రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కోరారు. కాదు కాదు సిఫారసు చేశారు. దీనిని ఉప రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్లారు.


మా పార్టీకి చెందిన ఎంపీలందరినీ గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పారు నాటి విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి. అ ధికారంలోకి వచ్చాక తమ చేతిలో ఏమీ లేదని అదంతా దేవుడి దయ అని, భగవంతుడు దీవెనలు అందిస్తే హోదా సాధ్యమని కూ డా చెప్పారు. ఇవి సీఎం హోదాలో చేసిన బాధ్యతాయుతమయిన మాటలు అని అనుకోవడం మనవంతు. బాధ్యతారాహిత్యం అ న్నది టీడీపీ మాట. అసలు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చెప్పిన టీడీపీనే తరువాత రివర్స్ గేర్ వేయడంతో తాము మళ్లీ హో దా అం శంతో ఎన్నికలు పోయామని చెబుతోంది వైసీపీ. ఇవన్నీ ఇవ్వని హోదాకు సంబంధించి నేతలు ఇచ్చిన ప్రకటనలు మరి యూ వా టికి సంబంధించిన ఉద్దేశాలు, ఉద్వేగాలు.


మనతో పాటు ప్రత్యేక హోదాను కోరుతున్న ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ కూడా కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతోంది స్టాండింగ్ కమిటీ. రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన విభజన చట్టం అనుసరించి తమకు ఈ హోదా ప్రసాదించాలని సాయిరెడ్డి అడుగుతు న్నారు. ఇవన్నీ బాగున్నాయి కానీ కేంద్రం ఇందుకు సమ్మతిస్తుందా? ఆంధ్రాకు ఇస్తే మాకూ కావాలని తెలంగాణ అంటోంది. ఈ తరహా ఇంకొన్ని హామీలు ప్రధానంగా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. కానీ జమ్మూ - కశ్మీర్, లద్దఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలు గా విభజించి వారికి భారీగా నిధులు ఇచ్చిన విధంగా తమకూ ఇవ్వాలని కోరుతున్నారు సాయిరెడ్డి. ఏదేమైనప్పటికీ పార్లమెం ట్ లో ప్రకటనలూ, ప్రకంపనలూ పూర్తయ్యాక ఆంధ్రావనికి హోదా ఇవ్వలేమని తేల్చేసిన  కేంద్రం దగ్గర మళ్లీ పాత పాటే అందుకో వ డంలో విజయ సాయి రెడ్డి పొందే ఆనందం ఏంటో కానీ ఇది అమలుకు నోచుకోని విషయమని తేలిపోయాక మనం  మళ్లీ అడగడం లో అర్థం ఉందా?

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: