వాక్సీన్ గణేశ్ వచ్చేడు వెల్కం వెల్కం
ఎన్నో మహమ్మారులు వస్తాయి
సంస్కృతి అన్నది అలానే ఉంటుంది
అది నదీనదాల కలబోత అని చెప్పాడు కవి
అవును! ఏ దేశ సంస్కృతి కాదొక బిందువు అని కూడా తేల్చాడు
సముద్రంలాంటి జీవితం సముద్రంలాంటి సంస్కృతి ఈ రెండూ
ఈ పండుగ వేళ మిమ్మల్ని పలకరిస్తున్నాయి..తరచి చూడండి
ఆది దేవుడు విఘ్నేశుడు వీధిలో కొలువై ఉండేందుకు సిద్ధం చేసే పందిరి. పిల్లలకూ, పెద్దలకూ లేని ఆహ్వానం. అందరూ ఒకేసారి స్మరించే అవకాశం గణేశ్ మండపం ఇస్తుంది. భగవంతుడు అనుగ్రహిస్తే ఆనందించండి అని చెప్పడం కాదు ఆ అనుగ్రహ సిద్ధి కో సం ఏడాదికో సారి మనుషులంతా ఒక్కటే అని చెప్పే ప్రయత్నం కూడా చేయండి. భాగ్య నగరి దారుల్లో పండుగ, మా శ్రీకాకుళం దారుల్లో పండుగ.. పండుగ బీజేపీది కాదు వైసీపీదీ కాదు అందరిదీ..అని అర్థం చేసుకుంటే చాలు. పార్టీల తగాదాలను పట్టించు కోకుండా ఈ పండుగ చేసుకోవాలి అన్న తలంపు ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సంస్కృతి అన్నది మట్టి నుంచి వస్తుంది.. మట్టిలో కలిసే వరకూ మనిషి తోడు ఉంటుంది కనుక ఏ మహమ్మారి కూడా సంస్కృతిని అడ్డుకోలేదు. సంప్రదాయ వెలుగులను అడ్డుకో లేదు. పండుగకు అర్థం ఆనందంలో ఉండడం.. ఆనందించి ఉండు అని చెప్పడం.. ఉండడం అంటే మనుగడ.. ఉండాలని చెప్పడం ప్రతిపాదన.. అంతా మన వారే అని చెప్పేది ఊరేగింపు.. వేడుకల్లో ప్రకృతి వినిపించే నినాదం మన జీవితం.. నదికి దండం పెట్టి వెళ్లండి అని చెప్పడం మన వైదికం.. ఇవి పార్టీలు ఆపుతాయి అని చెప్పలేను చెప్పబోను...అదిగో వ్యాక్సీన్ గణేశుడు స్వాగతం చెప్పండి.
చవితి పండుగకు కొన్ని అడ్డంకులు ఉన్నా రావాల్సిన వాడు వస్తాడు. రావాల్సిన వాడు వచ్చేక చల్లని చూపుల దీవెనలు ఇచ్చాక పండుగకో పరిపూర్ణత వస్తుంది. పాలకులు రావద్దంటే, రావద్దని నిషేధిత ఆజ్ఞలు జారీ చేస్తే రావాల్సిన వాడు రాకుండా ఉంటాడా?
ఏపీ సర్కార్ ను కోర్టు నడిపిస్తుంది. లేదా నడిపించే క్రమంలో ఏవో కొన్ని నిబంధనలు పాటించమని చెబుతోంది. ఆ క్రమంలో మం డపాలకు ఆఖరి నిమిషాన అయిన పూర్తి స్థాయిలో అనుమతులు మంజూరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మండపం ఉ న్నా లేకపోయినా, పండుగ సంతోషాలను ఎవ్వరు ఆపగలరు. ఎవ్వరు నియంత్రించగలరు. మట్టి వినాయకుడి వస్తున్నాడదిగో స్వాగతం చెప్పండి. ఇప్పటికే ప్రయివేటు స్థలాలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కూడా చెబుతోంది. దీంతో పండుగ ఆనందాలు రెట్టింపు అయ్యాయి.