ప్రజల్లో పవన్ పై నమ్మకం పెరగాలంటే.. ఇదే సరైన దారి?

praveen
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన్నప్పటినుంచి  ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అడుగడుగునా పవన్ కళ్యాణ్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రజలు పవన్ కళ్యాణ్ ను నమ్మినట్లు కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా దెబ్బ కొడుతున్నారు.  ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడైనా  బహిరంగ సభలు నిర్వహించారు అంటే చాలు వేలాది సంఖ్యలో అక్కడికి తరలి వస్తుంటారు ప్రజలు. పవన్ చెప్పిన వాటికి చప్పట్లు కొడుతూ రచ్చరచ్చ చేస్తారూ. ఇక ఇదంతా చూస్తుంటే వామ్మో పవన్ కి ఎంత ఫాలోయింగ్ ఉంది..  ఇక ఎన్నికలు వచ్చాయి అంటే పవన్ భారీ మెజారిటీతో గెలిచి తీరుతారూ అని నమ్మకం కలుగుతుంది ప్రతి ఒక్కరిలో.


 కానీ తీరా ఎన్నికల సమయానికి చప్పట్లు కొట్టిన చేతులతోనే వేరే పార్టీలకు ఓట్లు వేసి చివరికి పవన్ కళ్యాణ్ ను దెబ్బ కొడుతున్నారు. దీనికంతటికీ కారణం పవన్ పై ప్రజల్లో నమ్మకం లేక పోవడమే. ఇక ఆ నమ్మకాన్ని కూడగట్టుకోవడానికి పవన్ ఎన్నో రోజుల నుంచి ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు.  అయినప్పటికీ ప్రజల మనసును మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఇటీవలే పవన్ చేసిన ఒక పని ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది.



 కేంద్రం హైవేలు అన్నింటినీ కూడా మరింత పటిష్టం చేస్తూ ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో కనీసం లోకల్ రోడ్ లను కూడా సరిగ్గా బాగు చేసుకోలేక పోతుంది అంటూ పవన్ విమర్శలు చేశారు.  రాష్ట్ర ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడానికి వస్తుంది కానీ రోడ్లు బాగు చేయడానికి రావట్లేదా అంటూ ప్రశ్నించారు   ఇలాంటి రోడ్ల వల్ల ప్రజల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.  పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ఒక్క గొంతుక వెయ్యి గొంతుకల లాగా అటు ప్రభుత్వం పై పడిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది మద్దతు తెలిపారు.  మీతో కలిసి మా ప్రాంత సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు పోరాడుతాం అంటూ ఎంతో మంది చేయి కలిపేందుకు సిద్ధమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ఇదే దారిలో వెళితే తక్కువ రోజుల్లోనే ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: