కేటీఆర్@ మనసున్న మనిషి.. ఇదే నిదర్శనం?
సాధారణంగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రజలలో సామాజిక స్పృహ పెంచేందుకు.. సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎప్పుడూ పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే అటు కేటీఆర్ ని సహాయం అడగాలి అనుకున్న వారు కూడా ఎంతోమంది ఇక కేటీఆర్ ను ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ సహాయం అడుగుతూ ఉంటారు. ఇలా ఎవరైనా సహాయం అడిగారు అంటే చాలు వెంటనే స్పందిస్తూ.. నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తారు. ఏకంగా ఆ కుటుంబంలో సొంత అన్నలా మారీ కుటుంబ బాధ్యతలను తీసుకొని గొప్ప మనసు చాటుకుంటూ ఉంటారు కేటిఆర్.
ఇలా కేటీఆర్ ఇప్పటి వరకు ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు అనే చెప్పాలి. ఎంతో మంది నిరుపేదలు సరైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న వారు కేటీఆర్ ని సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు సహాయం కోరారు. ఇక వారు సహాయం కోరిన వెంటనే వారికి కావాల్సిన సహాయాన్ని అందించి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు కేటీఆర్. ఇలా కేవలం తెలంగాణ వాసులకే కాదు ఇతర రాష్ట్రాల వారికి సైతం ఎన్నో సార్లు సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఇలా తన రాజకీయ చతురతతో గొప్ప రాజకీయ వేత్త గా మారడమే కాదు తన గొప్ప మనసుతో.. మనసున్న మనిషిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు కేటీఆర్.