తమిళనాడు అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారిన మెగా బ్రదర్స్..

Divya
పవన కళ్యాణ్ నిన్న చేసిన ఒక ట్వీట్ కారణంగా నేడు పవన్ కళ్యాణ్ , చిరంజీవి ఇద్దరు తమిళనాడు అసెంబ్లీ లో హాట్ టాపిక్ గా మారారు.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం తమిళనాడు రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేయడంతోపాటు, చప్పట్ల మోత మోగిస్తున్నారు. ఇటీవల అనగా ఈరోజు ఉదయం ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ లో తమిళనాడు ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యన్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ గురించి అసెంబ్లీలో ఉన్న నేతలకు వినిపించడం జరిగింది.

హెల్త్ మినిస్టర్ శ్రీ సుబ్రహ్మణ్యన్  అసెంబ్లీలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఇటీవల  సీఎం స్టాలిన్ గారి గురించి మాట్లాడుతూ ఒక ట్వీట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు చిరంజీవి ఎవరు అనగా తమిళనాడులో దళపతి లాగే ఆంధ్రాలో సూపర్ స్టార్ చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఒక సూపర్ స్టార్ హీరో. ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది.. తమిళం రాజకీయ నేతల గురించి ఒక మంచి విషయం తెలిపాడు..ఏ పార్టీ అయినా ప్రభుత్వం లోకి రాకముందు రాజకీయం చేయాలే కానీ ,ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయకూడదు..

దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు.మీ పరిపాలన, మీ ప్రభుత్వ పనితీరు ముఖ్యంగా మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం అలాగే స్ఫూర్తిదాయకం .. అని చెప్పి మీకు నా శుభాకాంక్షలు అని చెప్పి పవన్ కళ్యాణ్  నిన్న ట్విట్టర్ లో ట్వీట్ చేసినట్టు  హెల్త్ మినిస్టర్ శ్రీ సుబ్రహ్మణ్యన్ తెలపడంతో ,ఒక్కసారిగా అసెంబ్లీ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది.. అంతేకాదు పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన ట్వీట్ ను కొన్ని వేల మంది చూశారు అంటూ ఆరోగ్య శాఖ మంత్రి తెలపడం జరిగింది.


తమిళనాడు రాజకీయ నేతల పరిపాలన చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడంతో అసెంబ్లీలో నాయకులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: