స్వర్గీయ హరికృష్ణ చివరి కోరిక ఇదేనా ?
హరికృష్ణ నాన్నకు వెన్నంటే ఉండి అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేసేవాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ కి ఉన్న మంచి తనం మూలాన తన వెనుక జరుగుతున్న కుట్రను తెలుసుకోలేకపోవడంతో 1995 లో పార్టీ కుప్పకూలిపోయింది. అయితే అంత వరకు తన తండ్రి వెంటే ఉన్న హరికృష్ణ సడెన్ గా పార్టీ ఫిరాయించారు. అంతటి సంక్షోభ సమయంలో తన తండ్రి మాట కాదని బావ అయిన చంద్రబాబు నాయుడుకే మద్దతును ఇవ్వడం తెలుగు జాతి గర్వించదగినది కాదు. అయితే ఆనాడు ఎన్నో పరిస్థితుల నడుమ అలా చేయవలసి వచ్చింది అని ఆ తర్వాత చాలా వార్తల్లో వచ్చినా అవన్నీ ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తి పరచడంలో విఫలం అయ్యాయి. ఒక వైపు చెల్లెలు భర్త కావడం...రాజకీయం స్ట్రాంగ్ గా ఉండడం వంటి పలు కారణాల చేత చంద్రబాబు నాయుడుకు ఆరోజున ఎదురు చెప్పలేకపోయారని అప్పట్లో తెలిసింది.
హరికృష్ణ రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేని నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇతను తన రాజకీయ జీవితంలో రాష్ట్ర మంత్రిగా, శాసన సభ్యుడు గా, రాజ్య సభ సభ్యుడిగా ప్రజలకు సేవలు అందించారు. ఆ తర్వాత హరికృష్ణ కూడా పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేసి మరో పార్టీని పెట్టారు. అది కూడా వర్క్ ఔట్ కాకపోవడంతో మళ్లీ టీడీపీలోకి వచ్చేశాడు. ఎవ్వరూ చేయని విధంగా 2014 సంవత్సరంలో రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా తన రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అప్పటి నుండి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది లేదు. కానీ హరికృష్ణ ఆ తర్వాత చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి కైనా రాజకీయాల్లోకి వెళ్లి టీడీపీ ఆ సారధ్య బాధ్యతలను తీసుకోవాలని అనుకునే వాడని అప్పట్లో తెలిసింది. ప్రజల ఆకాంక్ష కూడా ఇదే. కానీ ఎందుకో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సుముఖంగా లేడు. భవిష్యత్తులో అయినా తండ్రి ఆఖరి కోరిక తీరుస్తాడేమో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ తీవ్ర కష్టాల్లో ఉంది. అధికారాన్ని కోల్పోవడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. చంద్రబాబు సైతం ఎమీ చేయలేక సతమతమవుతున్నారు. అలా హరికృష్ణ తన రాజకీయ జీవితాన్ని గడిపాడు. ఈయన 2018 ఆగస్ట్ 29 న కావలిలో పెళ్లి కోసమని వెళుతుండగా మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రోజు ఈయన వర్ధంతి. ఆయాన ఆత్మ ఏ లోకంలో ఉన్నా శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్దిద్దాము.