కేసీఆర్ పథకం.. ఉన్నోళ్ళకే లాభం?
ఇక తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఎప్పుడు అధికారపక్షం తీరును ఎండగడుతూ ఉంటారు ఎమ్మెల్యే సీతక్క. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు విషయంలో జరుగుతున్న అసలు వాస్తవం చెబుతూ కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కెసిఆర్ పాలనలో నిరుపేదల కంటే ధనవంతులకే ఎక్కువగా లాభం జరుగుతుంది అంటూ ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు అన్ని ఉన్నోళ్ళకే లాభసాటిగా మారి పోయాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ద్వారా రైతులందరికీ పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నాము అంటూ గొప్పలు చెప్పుకుంది. అయితే రైతు బంధు పథకం ద్వారా లేని వాళ్ళ కంటే ఏకం గా టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు అంటూ సీతక్క విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి కి రైతుబంధు పేరుమీద ప్రతి ఏడాది 60 లక్షల చొప్పున తీసుకుంటున్నారని.. ఈ లెక్కన ఇక నాలుగేళ్లలో 2.40 కోట్లు ఇప్పటివరకు ముట్టాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఒకరికి కట్ చేసి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్న కేసీఆర్ రైతుబంధు విషయంలో మాత్రం ప్రజల సొమ్మును ఉన్నోళ్ళకి పంచి పెడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సీతక్క.