షర్మిల ని టార్గెట్ చేసిన మీడియా.. కెసిఆర్ చెప్పారా ఏంటీ?
నిరుద్యోగుల తరఫున పోరాడటమే తన ముఖ్య ఉద్దేశం అంటూ ప్రస్తుతం ఇప్పటికే నిరుద్యోగుల తరపున దీక్షలు కూడా చేపట్టారు. అంతేకాదు కెసిఆర్ ప్రభుత్వం పై అప్పుడప్పుడు విమర్శలు చేయడం లాంటివి కూడా చేశారు. ఇక ఇటీవల ఏకంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వందల నామినేషన్స్ వెయ్యాలి అంటూ నిరుద్యోగులు
కు పిలుపునిచ్చారు. ఇలా నిరుద్యోగులతో నామినేషన్స్ వేయించడం వల్ల అటు ప్రతిపక్షాల ఓట్లు చీల్చి వేసి అధికారపక్షం భారీ మెజారిటీ సాధించాలని ఉద్దేశంతో కెసిఆర్ కు మంచి జరిగేందుకు ఇండైరెక్ట్ గా షర్మిల ఇలాంటి పిలుపునిచ్చారు అన్న ప్రచారం కూడా జరిగింది.
అయితే ఇలా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కెసిఆర్ కు అనుకూలంగా షర్మిల ముందుకు సాగుతున్నారు అనే టాక్ వినిపించినప్పటికీ ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా టిఆర్ఎస్ అనుకూల మీడియా అటు షర్మిలను టార్గెట్ చేయడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. టిఆర్ఎస్ అనుకూల మీడియా గా ఉన్న పలు చానళ్లు ప్రస్తుతం షర్మిలను ఉద్దేశిస్తూ పలు కథనాలు ప్రచురితం చేస్తున్నాయి. తండ్రి సెంటిమెంట్ తో ఎంట్రీ ఇచ్చి గురిలేని బాణంలా షర్మిల ముందుకు పోతుందని.. ఎన్నో కథనాలు ప్రస్తుతం షర్మిలను ఉద్దేశిస్తూ ప్రచురితం అవుతున్నాయి. ఇలా కేసీఆర్ కు అనుకూలం అనుకుంటున్న షర్మిలనే టీఆర్ఎస్ అనుకూల మీడియా టార్గెట్ చేయడానికి వెనుక కారణం ఏంటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.